Salt Intake
Viral, లేటెస్ట్ న్యూస్

Health: ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకొని తింటున్నారా?.. శరీరంలో ఏం జరుగుతుందంటే?

Health: కొంతమంది భోజనం చేసేటప్పుడు కూరల్లో వేసిన ఉప్పు చాలదు అన్నట్టుగా ఎక్స్‌ట్రా (Salt) వేసుకొని మరీ తింటుంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవాళ్లు చాలామందే ఉంటారు. అయితే, ఈ అలవాటు మంచిదా? కాదా?, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. ఉప్పును సోడియం క్లోరైడ్ అని కూడా పిలుస్తారు. హార్వర్డ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ‘ది న్యూట్రిషన్ సోర్స్’ అనే వెబ్‌సైట్ ప్రకారం, ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. రుచి కోసం ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉప్పు చల్లుకొని తినడం ద్వారా శరీరానికి అందే సోడియం ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన దేశంలో ఉప్పు వినియోగ స్థాయి ఎంత?
భారతీయులు అతి ఎక్కువగా ఉప్పు తింటుంటారని, ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ షేక్ మహ్మద్ అస్లామ్ చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన ‘వన్ పించ్ ఆఫ్ సాల్ట్’ ప్రచారం ప్రకారం, మన దేశంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ రోజూ తినే ఉప్పు పరిమాణం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) సూచించిన 5 గ్రాముల కంటే చాలా అధికంగా ఉందన్నారు.

సోడియం ఎలా హాని చేస్తుంది?
సోడియంను ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు. ఉప్పు ఎక్కువగా తినే తొలినాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, కాలక్రమంలో శరీరంలోని అనేక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధికంగా ఉప్పు తింటే శరీరం నీటిని నిల్వ చేసుకుంటుందని, గుండెకు హాని కలిగిస్తుందని, ధమనులపై ఒత్తిడి పెరుగి వల్ల హై బీపీ వస్తుందని డాక్టర్ షేక్ మహ్మద్ అస్లామ్ అప్రమత్తం చేశారు. సోడియం ఎక్కువైతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు కూడా దారితీస్తుందన్నారు. ధమనులు గట్టిగా మారతాయని, గుండె సంబంధిత వ్యాధులు పెరుతాయని, కిడ్నీల పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు చవిచూడాల్సి వస్తుందని డాక్టర్ షేక్ మహ్మద్ అస్లామ్ వివరించారు. ప్రమాదకర స్థాయిలో కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా దారితీస్తుందని హెచ్చరించారు.

Read Also- Viral News: రెస్టారెంట్‌లో నీతా, ఇషా అంబానీలు.. వీడియో వైరల్

బయటపడడం ఎలా మరి?
1. సోడియం తక్కువ ఉండే ఉప్పు
ఉప్పును పూర్తిగా మానుకోలేనివాళ్లు, సోడియం తక్కువగా ఉండే ఉప్పును వాడాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు. తక్కువ సోడియం ఉన్న ఉప్పు రుచిలో ఏమాత్రం మార్పు ఉండదు. దీనిలో పొటాషియం కూడా ఉండడంతో బీపీ తగ్గుతుంది.

2. తక్కువ ఉప్పుతో వంట
వంటలు, తిను పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధికంగా ఉప్పు కలిగిన పదార్థాలకు బదులు తాజా కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లు వాడాలి. రుచి కోసం వంటల్లో ఉప్పుకు బదులు హర్బ్స్, మసాలాలు వాడాలి. సాస్‌లు, డ్రెస్సింగ్‌లను కూడా తక్కువ సోడియం ఉన్నవాటినే ఎంచుకోవాలి.

Read Also- Tsunami Warning: సునామీ భయంతో తీర ప్రాంతాల్లో కలకలం.. ప్లాట్‌లోనే ఉండిపోయిన మహిళ

3. ఎక్స్‌ట్రా ఉప్పు వొద్దు
ఆహారం తినేటప్పుడు ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకోవద్దు. భోజనం రుచిగా లేదనిపించినా అలా తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. క్రమంగా అలవాటైపోతుంది. అందుకే, ఎక్స్‌ట్రా ఉప్పు అలవాటును వెంటనే మానుకోండి.

4. డాష్ డైట్ పాటించాలి
హై బీపీ ఉన్నవారు DASH (Dietary Approaches to Stop Hypertension) డైట్‌ పాటించాలి. ఈ డైట్‌లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్‌లు (కోలెస్ట్రాల్‌, కొవ్వు తక్కువ ఉండే డెయిరీ పదార్థాలు) సోడియంను తగ్గిస్తాయి.

5. రోజుకు ఎంత సోడియం తినొచ్చు?
రోజుకు 2,300 మిల్లి గ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోవడం మంచిది కాదని డాక్టర్ షేక్ మహ్మద్ అస్లామ్ సూచించాయి. అంటే సుమారుగా ఒక టీ స్పూన్ ఉప్పు మాత్రమేనని అన్నారు. హై బీపీ ఉన్నవారికి 1,500 మిల్లిగ్రాముల ఉప్పు మేలు అని సూచించారు.

గమనిక: సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు