Health Issues (Image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

Health Issues: కమ్మగా తిని.. హాయిగా స్నానం చేస్తున్నారా? ఇక మీ పని ఔట్!

Health Issues: కొందరికి భోజనం చేసిన తర్వాత స్నానం లేదా షవరింగ్ (Showering) చేసే అలవాటు ఉంటుంది. అయితే ఇది శరీరంపై దుష్ప్రభావాన్ని చూపుతుందని లైఫ్ స్టైల్ కోచ్ లూక్ కౌటిన్హో (Luke Coutinho) తెలిపారు. ఇందుకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు. భోజనం తర్వాత స్నానం చేసే అలవాటు.. జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అందులో వివరించారు.

జీర్ణ ప్రక్రియకు అంతరాయం
‘జీర్ణక్రియ అనేది కేవలం ఆహారాన్ని కడుపులో విచ్ఛిన్నం చేయడం మాత్రమే కాదు. ఇది రక్త ప్రవాహం, నరాల పనితీరు, శరీర ఉష్ణోగ్రత సమతుల్యతపై ఆధారపడిన శక్తివంతమైన ప్రక్రియ’ అని లూక్ కౌటిన్హో తన ఇన్ స్టా పోస్టులో అన్నారు. భోజనం తర్వాత వెంటనే వేడి లేదా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల సున్నితమైన ఈ వ్యవస్థలో అంతరాయం ఏర్పడి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు.

రక్త ప్రవాహానికి బ్రేకులు!
కౌటిన్హో వివరణ ప్రకారం ‘భోజనం తర్వాత స్నానం చేస్తే రక్త ప్రవాహం కడుపు నుండి చర్మం వైపు మళ్లుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. చన్నీటి స్నానం వల్ల రక్తనాళాలు సంకోచం (వాసోకాన్స్ట్రిక్షన్) చెందుతాయి. ఇది రక్త ప్రవాహాన్ని పరిమితం చేసి ఒత్తిడి ప్రతిస్పందనను కూడా ప్రేరేపించవచ్చు. ఇది జీర్ణక్రియను మరింత దెబ్బతీస్తుంది. మీ పేగు ఇప్పటికే సమస్యలతో సతమతమవుతుంటే తప్పుడు సమయంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది’ అని తెలిపారు.

Also Read: Hair Care Tips: వర్షాకాలంలో జట్టు అధికంగా రాలుతోందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

తప్పదనుకుంటే ఇలా చేయండి!
ఒకవేళ భోజనం తర్వాత స్నానం తప్పనిసరి అనుకుంటే కనీసం 90-120 నిమిషాలు వేచి ఉండాలని కౌటిన్హో అన్నారు. అలా కుదరని పక్షంలో స్నానానికి ముందే భోజనం చేస్తే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. అలా చేస్తే జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుందని అన్నారు. ‘భోజనం తర్వాత స్నానం చేసే వారు.. వెంటనే ఎటువంటి లక్షణాలు గమనించకపోవచ్చు. కానీ జీర్ణక్రియలో పదేపదే అంతరాయం కలిగించడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు’ అని కౌటిన్హో హెచ్చరించారు. ఐబీఎస్, పెద్ద ప్రేగు సమస్య, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు దీర్ఘకాలంలో కనిపించవచ్చని స్ఫష్టం చేసారు.

Also Read This: Tsunami Warning: సునామీ భయంతో తీర ప్రాంతాల్లో కలకలం.. ప్లాట్‌లోనే ఉండిపోయిన మహిళ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్