Nita Ambani and Isha Ambani
Uncategorized, Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: రెస్టారెంట్‌లో నీతా, ఇషా అంబానీలు.. వీడియో వైరల్

Viral News: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ప్రతి చిన్న అంశంపైనా జనాలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటారు. అంబానీ కుటుంబ సభ్యులు ఎక్కడికెళ్లినా, ఏం ధరించినా, ఎవరిని కలిసినా వార్తలుగా (Viral News) మారుతుంటాయి. మన దేశంలోని అగ్రగామి పారిశ్రామిక ఫ్యామిలీ కావడం, వారి సిరిసంపదలు, వ్యాపార సామ్రాజ్యం ఇందుకు కారణమవుతున్నాయి. తాజాగా, అలాంటి వైరల్ వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, ఆయన కూతురు ఇషా అంబానీ అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ఉన్న ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్‌‌ను సందర్శించడం ఆసక్తికరంగా మారింది. వికాస్ ఖన్నా నిర్వహిస్తున్న ‘బంగళా’ అనే రెస్టారెంట్‌ను ఈమధ్యే సందర్శించారు. ఎన్ఎంఏసీసీ (Nita Mukesh Ambani Cultural Centre) ఇండియా వీకెండ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ప్రస్తుతం తల్లి-కూతరు న్యూయార్క్‌లో ఉన్నారు. రెస్టారెంట్ సందర్శన సందర్భంగా నీతా అంబానీ, ఇషా అంబానీ ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Read also- Tsunami Warning: సునామీ భయంతో తీర ప్రాంతాల్లో కలకలం.. ప్లాట్‌లోనే ఉండిపోయిన మహిళ

ఇద్దరూ స్మార్ట్ క్యాజువల్ లుక్‌లో కనిపించారు. చూడడానికి సింపుల్‌గానే ఉన్నా ఆ దుస్తులు మోడ్రన్‌గా కనిపించాయి. ఇషా అంబానీ ఒక ప్రింటెడ్ టాప్, డెనిమ్ జీన్స్ ధరించారు. ఒక బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ స్ట్రైప్స్ ఉన్న హాఫ్ స్లీవ్డ్ టాప్‌ను ఆమె ధరించారు. ఈ టాప్‌కు మ్యాచింగ్‌గా, ఒక క్రింకుల్ టెక్స్చర్ ఉన్న ఆఫ్ వైట్ క్రాప్‌డ్ జాకెట్‌ను ఇషా ధరించారు. హొరిజాంటల్ బ్లాక్ స్ట్రైప్స్, ఓపెన్ ఫ్రంట్ డిజైన్, ఫుల్ స్లీవ్స్, టైలర్డ్ ఫిట్ ఈ దుస్తుల్లో కనిపించాయి. ఇషా అంబానీ ధరించిన జీన్స్.. లైట్ బ్లూ షేడ్ ఉన్న హై-యాంకిల్ ‘మామ్ డెనిమ్ జీన్స్’. ఈ జీన్స్‌లో హై-రైజ్ వెయిస్ట్‌లైన్ ఉంటుంది.

ఇక, నీతా అంబానీ, ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్‌లో చక్కగా కనిపించారు. నీతా అంబానీ.. లైట్ గ్రీన్ కలర్‌లో ఫ్లోరల్ ప్రింట్ ఉన్న సాటిన్ కో-ఆర్డ్ సెట్‌ను ధరించారు. టాప్‌లో లాపెల్ కాలర్స్, ఫ్రంట్ బటన్ క్లోజర్స్, ఫుల్ స్లీవ్స్, రిలాక్స్‌డ్ సిల్హౌట్ ఆకర్షణీయంగా కనిపించాయి. ఈ టాప్‌కు మ్యాచించ్‌గా ‘ఫ్లేర్డ్ ఫిట్’ ఉన్న ప్యాంట్స్‌‌ను ధరించారు. లూజ్ హెయిర్, డైమండ్ స్టడ్ ఈయరింగ్స్, లగ్జరీ వాచ్, రింగ్స్, పీప్-టో శాండల్స్‌లో ఆమె రెస్టారెంట్‌కు వచ్చారు. ఇక తల్లి-కూతురు ఇద్దరూ మేకప్ వేసుకోలేదు. కొన్ని అలంకరణ వస్తువులు ధరించారు. అయినప్పటికీ ఆకర్షణీయంగా కనిపించారు.

Read Also- Delhi Woman: పిల్లలు ఉన్నారని.. జాబ్ నిరాకరణ.. యువతికి షాకింగ్ అనుభవం!

ఇక, ఎన్ఎంఏసీసీ ఇండియా వీకెండ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ముంబై వేదికగా నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) సాంస్కృతిక విశిష్టతను న్యూయార్క్ సిటీలో పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన మూడు రోజుల ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం. సెప్టెంబరు 12 నుంచి 14 వరకు జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ కళలు, ఫ్యాషన్, సంగీతం, డ్యాన్స్ వంటి అంశాలను ప్రపంచానికి చూపించాలని అంబానీ కుటుంబం భావిస్తోంది.

 

Just In

01

Akhanda 2 release: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Jagadish Reddy: 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదు: జగదీష్ రెడ్డి

IND vs WI First Test: తొలి టెస్టులో చెలరేగిన సిరాజ్.. పీకల్లోతూ కష్టాల్లో వెస్టిండీస్.. ఇక వార్ వన్ సైడేనా!

TG Government Lands: ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం ఫోకస్.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి!

Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!