PM Modi Loksabha
జాతీయం, లేటెస్ట్ న్యూస్

PM Modi: ఉగ్ర మూకలపై చెప్పింది చేశాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఉగ్రవాదుల విషయంలో ఏ మాత్రం వెనుకడుగు ఉండదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడారు. ఈ వర్షాకాల సమావేశాలు భారత విజయోత్సవ సమావేశాలని అన్నారు. ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేసినందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పారు. సింధూర్ శపథాన్ని నెరవేర్చినందుకు ఈ విజయోత్సవాలు, భారత సైన్యం ధైర్య సాహసాలకు ఈ విజయోత్సవాలు అని వ్యాఖ్యానించారు.

చెప్పాం.. చేసి చూపించాం.. 

ఉగ్ర మూకల విషయంలో భారత్ తీరు కనిపించని వారికి తాను అద్దం చూపిస్తానని ప్రధాని అన్నారు. దేశ ప్రజలకు తాను రుణపడి ఉన్నానని, వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు చేసిన దాడి క్రూరత్వానికి పరాకాష్టగా పేర్కొన్నారు. దేశం ఐక్యంగా నిలబడి ఆ కుట్రను తిప్పికొట్టిందని, ఉగ్రవాదులను మట్టిలో కలుపుతామని తాను బహిరంగంగానే హెచ్చరించానని, చేసి చూపించామని చెప్పారు. ఉగ్రవాదులకే కాదు వారి సూత్రధారులకు కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు.

Read Also- Robbery in Shadh nagar: దొంగలకే దొంగ డిఫరెంట్ దొంగ.. ఆమ్లెట్ వేసుకొని మరి!

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ 

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మోదీ అన్నారు. భారత స్వావలంబన శక్తిని యావత్ ప్రపంచం గుర్తించిందని, మేడిన్ ఇండియా డ్రోన్లు, మిస్సైళ్లు పాక్‌ను చీల్చి చెండాడాయని తెలిపారు. లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల మూలాన్ని నాశనం చేశామని, పహల్గా్ దాడితో పాక్ ఆ అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు. ఏళ్ల తరబడ గుర్తుండే పాఠాన్ని భారత సైన్యం పాకిస్థాన్‌కు ఇచ్చిందని చెప్పారు.

కాంగ్రెస్‌ మాత్రమే..

తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను కచ్చితంగా తుడిచిపెట్టాం అని మోదీ చెప్పారు. తాము ఏదైతే నిర్ణయించామో దాన్ని పూర్తి చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌ను కేవలం కాంగ్రెస్ మాత్రమే తప్పుబడుతున్నదని మండిపడ్డారు. యావత్ ప్రపంచం భారత్‌కు మద్దతు పలికిందని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం గుర్తించలేదని వ్యాఖ్యానించారు. తనను విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం సైన్యాన్ని తక్కువ చేస్తారా అంటూ ఫైరయ్యారు. కేవలం హెడ్‌లైన్స్‌లో వచ్చేందుకే తప్పుడు ఆరోపణలు చేశారని చురకలంటించారు

పాక్ వేడుకుంది

దాడి ఆపేయమని పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని తెలిపారు. పాక్ డీజీఎంవో ఫోన్ చేసి వేడుకున్నారని వివరించారు. అయితే, తమ దాడి రెచ్చగొట్టేది కాదని స్పష్టం చేశామన్నారు. జూన్ 9న తనతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు ప్రత్నించారని చెప్పారు. తాను సైన్యంతో మీటింగ్‌లో ఉండి మాట్లాడలేకపోయానని తెలిపారు.

ఆపరేషన్ సింధూర్ ఆగదు

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. పాక్ మళ్లీ దుస్సాహసం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. స్వావలబనతో భారత్ నేడు ముందుకు సాగుతున్నదని చెప్పారు. కానీ, పాకిస్థాన్ కోసం కాంగ్రెస్ దిగజారిందని విమర్శించారు. నేటి యుద్ధంలో ఇన్ఫర్మేషన్, న్యారేటివ్స్‌కు పెద్ద పాత్ర ఉందన్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాక్ అధికార ప్రతినిధులుగా మారాయని మండిపడ్డారు.

Read Also- Avatar Fire and Ash: ‘అవతార్ 3’ నుంచి విడుదలైన ట్రైలర్.. ఎలా ఉందంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!