Amit Shah: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించి ఇవాళ కూడా లోక్ సభ (Lok Sabha)లో చర్చ కొనసాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కి పాల్పడిన ముగ్గురు పాకిస్థాని ఉగ్రవాదులను హతమార్చినట్లు పార్లమెంటులో స్పష్టం చేశారు. మతం అడిగి మరి 26 మందిని పొట్టన పెట్టుకున్న ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా జులై 28న అంతం చేసినట్లు వివరించారు.
లోక్ సభలో షా ఏమన్నారంటే?
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను భారత సైన్యం సోమవారమే హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్ సభలో మాట్లాడారు. సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ మహాదేవ్’ నిర్వహించి.. ఆ ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయని స్పష్టం చేశారు. ‘నిన్న జరిగిన ఆపరేషన్ లో సులేమాన్, ఆఫ్గాన్, జిబ్రాన్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరికి ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ ముందే అరెస్ట్ చేసింది. ఆహారం పెట్టిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల మృతదేహాలు శ్రీనగర్‌కి చేరుకున్నప్పుడు పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడింది వీరినేని ఆశ్రయం కల్పించినవారు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో ముష్కరులు వాడిన ఆయుధాలపై ఎఫ్ఎస్ఎల్ నివేదిక (FSL) ముందే సిద్ధంగా ఉంది. ముగ్గురు ఉగ్రవాదుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు.. ఎఫ్ఎస్ఎల్ నివేదికలతో పోల్చి చూశాం. నిన్న చండీగఢ్‌లో మరిన్ని పరీక్షలు నిర్వహించగా వీరే పహల్గామ్ ఉగ్రదాడి చేసిన ముగ్గురని తుది ధృవీకరణ లభించింది’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah says, "… NIA had already arrested those who gave them shelter. Those who fed them were detained. When the terrorists' dead bodies reached Srinagar, they were identified as the three people who carried out the terror attack in… pic.twitter.com/TqNlZWXlIU
— ANI (@ANI) July 29, 2025
బాధిత కుటుంబాలను ఉద్దేశిస్తూ..
పహల్గాం దాడి తర్వాత బాధిత కుటుంబాలను తాను స్వయంగా కలిసినట్లు లోక్ సభలో అమిత్ షా చెప్పుకొచ్చారు. ‘పహల్గామ్ దాడి జరిగిన వెంటనే నేను బాధిత కుటుంబాలను కలిశాను. అప్పుడు నా ముందే ఒక మహిళ నిలబడి ఉంది. పెళ్లైన ఆరు రోజులకే విధవరాలిగా నిలబడ్డ ఆమె ముఖం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు బాధిత కుటుంబాలకు చెప్పదలచుకున్నా. ఉగ్రవాదులను పంపించిన వారిని ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారు. అలాగే పహల్గాంలో హత్యలకు పాల్పడ్డ ఉగ్రవాదులను ఈ రోజు మా భద్రతా దళాలు కూడా అంతమొందించాయి’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రదాడి వెనకున్న వారిని అంతం చేశామని.. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను మట్టుబెట్టామని వివరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు లోక్ సభ వేదికగా మరోమారు షా ధ్రువీకరించారు.
Also Read: Hormones Imbalance: స్త్రీలలో టాప్ 5 హార్మోన్లు.. ఇంబ్యాలెన్స్ అయితే చుక్కలే..!
పాక్‌కు క్లీన్ చిట్ ఇస్తున్నారా?
కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం (P. Chidambaram).. సోమవారం లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తాజాగా స్పందించారు. ‘నిన్న కాంగ్రెస్ మాకు ప్రశ్నలు వేసింది. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? దానికి బాధ్యత ఎవరిది అని. కచ్చితంగా బాధ్యత మాదే. ఎందుకంటే మేమే అధికారంలో ఉన్నాం. నిన్న మాజీ హోం మంత్రి చిదంబరం జీ ప్రశ్నించారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని ఏ ఆధారం ఉంది అని. నేను ఆయనను అడగాలనుకుంటున్నా. పాకిస్థాన్‌ను రక్షించడం వల్ల ఆయనకు ఏమి లభిస్తుంది? ఆయన ఇలా అంటున్నప్పుడు దాని అర్థం పాకిస్థాన్‌కు క్లిన్ చిట్ ఇస్తున్నట్టే’ అని అమిత్ షా అన్నారు. అలాగే కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గోగోయి చేసిన వ్యాఖ్యలకు సైతం షా కౌంటర్ ఇచ్చారు. ‘నిన్న గోగోయి జీ అన్నారు. ఏప్రిల్ 24న మోదీ జీ పహల్గామ్‌కు కాకుండా బీహార్‌కు వెళ్లారని. కానీ పహల్గామ్ దాడి జరిగిన సమయంలో మోదీ జీ విదేశాల్లో ఉన్నారు. మోదీ జీ బీహార్‌కు వెళ్లిన రోజున పహల్గామ్‌లో రాహుల్ గాంధీ మాత్రమే ఉన్నారు. మరెవరూ లేరు. దేశ పౌరులపై ఇలాంటి దాడి జరిగితే దానికి తగిన ప్రతిస్పందన ఇవ్వడం ప్రధాని బాధ్యత’ అని చెప్పుకొచ్చారు.