Shane tamura (Image Source: Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Shane Tamura: అమెరికాలో కాల్పులు.. కిల్లర్ మాములోడు కాదు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Shane Tamura: అగ్రరాజ్యం అమెరికా మరోమారు కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ లోని మన్ హట్టన్ (Midtown Manhattan) ప్రాంతంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆపై నిందితుడు తనని తాను కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. పలు సంస్థలకు చెందిన కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో సాయుధుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి మరి ఏఆర్‌- రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. 345 పార్క్‌ అవెన్యూ భవనంలోకి ప్రవేశించి రక్తపాతం సృష్టించినట్లు పేర్కొన్నారు. దీంతో భవనంలోని పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టినట్లు వివరించారు. ఇదిలా ఉంటే కాల్పులకు తెగబడిన ఉన్మాది గురించి కీలక విషయాలను అధికారులు కనుగొన్నారు.

మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్
మాన్‌హట్టన్‌ లో జరిగిన కాల్పులకు 27 ఏళ్ల షేన్ టమురా (Shane D Tamura) కారణమని న్యూయార్క్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అతడు లాస్ వేగాస్ (Las Vegas) కు చెందిన వాడిగా గుర్తించారు. కాలిఫోర్నియాలోని గోల్డెన్ వ్యాలీ, గ్రనాడా హిల్స్ హైస్కూళ్ల తరపున ఫుట్ బాల్ ఆడినట్లు సమాచారం. అతడు ఫుట్ బాల్ ఆటగాడిగా ఉన్నప్పటి వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అతడు లాస్ వేగాస్‌లో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గానూ పనిచేసినట్లు తాజాగా దర్యాప్తులో తేలింది. అలాగే 2022లో రద్దు చేయబడిన కాన్సీల్డ్ క్యారీ పర్మిట్ ను షేన్ టమురా కలిగి ఉన్నాడు.

నిందితుడికి మానసిక సమస్యలు!
న్యూయార్క్ సిటీ పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ ప్రకారం.. నిందితుడు టమురా గత కొంతకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీనిని లాస్ వేగాస్ అధికారులు సైతం ధ్రువీకరించారు. టమురా.. నెవాడా నుండి న్యూయార్క్ నగరానికి కారులో ప్రయాణించాడని.. ఈ దాడికి కొన్ని గంటల ముందు న్యూజెర్సీ గుండా రాష్ట్రంలోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు. దాడి అనంతరం అతడు వచ్చిన కారును అధికారులు తనిఖీ చేయగా అందులో ఒక లోడెడ్ రివాల్వర్, రైఫిల్ కేస్, మందుగుండు సామగ్రి, టమురాకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ మందులు లభించాయి. అయితే అతడు ఎందుకు దాడి చేశాడన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దానిని కనుగొనేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Divya – Darshan: హీరో ఫ్యాన్స్ నుంచి అత్యాచార బెదిరింపులు.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి!

ప్రత్యక్ష సాక్షి రియాక్షన్
ఇదిలా ఉంటే దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడు ఆయుధంతో భవనంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ ‘కాల్పుల వర్షంలా శబ్దం వినిపించింది. అది ఆటోమెటిక్, అధిక సామర్థ్యం గల ఆయుధంలా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు దాడిలో ఓ పోలీసు అధికారితో పాటు మరో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని.. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు దాడి ఘటనను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ (Twitter) వేదికగా సానుభూతి తెలియజేశారు.

Also Read This: Nimisha Priya Case: నిమిష ప్రియకు భారీ ఊరట.. ఫలించిన చర్చలు.. మరణశిక్ష రద్దు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!