Kyrgyzstan Indian students
అంతర్జాతీయం

Kyrgyzstan: భయం గుప్పెట్లో భారత విద్యార్థులు

Violence: మధ్యాసియా దేశం కిర్గిజిస్తాన్‌లో మూడు నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని బిష్కెక్‌లో విదేశీ విద్యార్థులపై స్థానికుల దాడి చాలా దేశంలో కలకలం రేపింది. ఈ విదేశీ విద్యార్థుల్లో ఎక్కువగా భారత్, పాకిస్తాన విద్యార్థులను కిర్గిజిస్తాన్ స్థానికులు టార్గెట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ భయాందోళనలు వెలికివచ్చాయి. యూనివర్సిటీ హాస్టల్స్‌లోకి వెళ్లి మరీ విదేశీ విద్యార్థులపై దాడులు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన కొందరు విద్యార్థులు మరణించినట్టూ వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల గురించి సమాచారం రాగానే కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ భారత విద్యార్థులను తిరిగి స్వదేశానికి పంపడానికి అనుమతించాలని, ఉద్రిక్తతలు సద్దుమణిగే వరకు ఆన్‌లైన్‌లో బోధన చేయాలని కోరింది. అలాగే.. భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ శాఖ ఎస్ జైశంకర్ చెప్పారు. అయితే, బిగ్ టీవీతో మాట్లాడిన భారత విద్యార్థులు మాత్రం వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు.

స్థానికులు, ఈజిప్టు విద్యార్థుల మధ్య గొడవ ముదిరి అల్లర్లకు దారి తీసింది. ఈజిప్ట్ విద్యార్థులపై దాడి చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో ఎదురుతిరిగారు. దీంతో స్థానికత్వ వివాదానికి తెరలేసింది. మే 17వ రాత్రి నుంచి విదేశీ విద్యార్థులను టార్గెట్ చేసి దాడులు మొదలు పెట్టారు. రాజధాని నగరంలోని పలు యూనివర్సిటీల్లోకి వెళ్లి హాస్టల్ విద్యార్థులపై దాడి చేశారు. కిర్గిజిస్తాన్‌లో ఎంబీబీఎస్ చేయడానికి చాలా దేశాల విద్యార్థులు వెళ్తారు. మన దేశం నుంచి కూడా ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల నుంచీ సుమారు 2,500 మంది విద్యార్థులు వెళ్లినట్టు చెబుతున్నారు. సుమారు 17 వేల మంది భారత విద్యార్థులు, వ్యాపారులు కిర్గిజిస్టాన్‌లో ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

బిగ్‌ టీవీతో మాట్లాడిన కొందరు విద్యార్థులు అక్కడి దుస్థితిని వివరించారు. బయట అడుగు పెట్టలేక ఆకలితో అలమటిస్తున్నట్టు చెప్పారు. ఆహారం కోసం బయటికి వెళ్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నదని, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టినా తాము ఎక్కడ ఉన్నది తెలిసిపోతుందని భయపడుతున్నారు. క్యాబ్ బుక్ చేసుకుందామనుకుంటే.. డ్రైవర్ స్థానికులు కావడంతో దాడి చేస్తున్న గుంపు వద్దకు తీసుకెళ్లి వదిలేస్తున్నారని వివరించారు. ఎటు వైపు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారో అనే భయంలో ఉన్నట్టు పేర్కొన్నారు. పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ చెబుతున్నారని, కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉన్నదని అన్నారు. తమను సజీవంగా స్వస్థలాలకు తరలించాలని రోధిస్తూ వేడుకున్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే 0555710041 నెంబర్‌కు కాల్ చేయాలని భారత రాయబార కార్యాలయం చెప్పిందని, కానీ, ఫోన్ చేస్తే నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమనేం చేయమంటారూ అంటూ ఆగ్రహిస్తున్నారని చెప్పారు.

విద్యార్థులను తరలించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పొరుగు దేశం పాకిస్తాన్ ముందున్నదని వారు చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ బిష్కెక్ ఎయిర్‌పోర్టు చేరుకుందని, పాకిస్తాన్ విద్యార్థులను విమానాల్లో తరలిస్తున్నారని వివరించారు. ఇక్కడ పరిస్థితులన్నీ బాగుంటే పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తమను కూడా వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్నికోరారు. ప్రస్తుతం యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాయని వివరించారు.

అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

బిష్కెక్‌లో జరిగిన ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటికే ఉన్నతాధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించారు. భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏదైనా అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి ఎంబసీ హెల్ప్‌లైన్ పూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులందరూ ప్రిపరేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇక్కడ జరిగిన ఘటనలో భారతీయ విద్యార్థి ఎవరూ తీవ్రంగా గాయపడలేదని సోషల్ మీడియా పోస్ట్‌లు వాస్తవం కాదని భారత రాయభారి ధృవీకరించారు. ఈ విషయాన్ని సీఎంకు వివరించారు అధికారులు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు