Srinivas Goud (imagecredit:swetcha)
Politics

Srinivas Goud: మరోసారి మోస పోవడానికి బీసీలు సిద్ధంగా లేరు

Srinivas Goud: బీసీ ఓట్ల కోసమే బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు డ్రామా ఆడుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud) అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం మొత్తం ఓబీసీ(BC) వర్గాల వెనకబాటు తనం పై చర్చ జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకుందని, చట్ట సభల్లో కూడా బీసీ లకు రిజర్వేషన్లు వస్తాయనే వాతావరణం ఏర్పడిందన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు దేవుడెరుగు ఇప్పుడు రాష్ట్రం లో స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు రావడం గగన మవుతోందన్నారు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్‌కు మోక్షం లభించలేదు. ఢిల్లీలో రాష్ట్ర పతి దగ్గర బుక్ బిల్లులు ఏమయ్యాయో తెలియదన్నారు.

రాష్ట్ర పరిధిలోని అంశం
బీసీల పట్ల కాంగ్రెస్(Congress) ,బీజేపీ(BJP)లది వగల ప్రేమే అని తేలిపోయిందన్నారు. తొమ్మిదో షెడ్యూల్లో పెడితే తప్ప బీసీ లకు రిజర్వేషన్లు పెరుగవు అన్నారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం లకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని తెలిసి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ ను గవర్నర్ దగ్గరకు ఎందుకు పంపారని నిలదీశారు. బీసీ(BC) బిల్లుల ఆమోదానికి కేంద్రం దగ్గర రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, బీసీల పై సీఎం ది కపట ప్రేమ అన్నారు. కాంగ్రెస్ బీసీ నాయకులు 42 శాతం రిజర్వేషన్ల పెంపు కోసం గట్టిగా కృషిచేయాలని కోరారు.

Also Read: Etela Rajender: ప్రభుత్వాలు ప్రేమతో ఇవ్వట్లేదు.. పోరాటాల ద్వారానే పథకాలు

కాంగ్రెస్ నేతలు సంబరాలు
సీఎం మంత్రులు బీసీ బిల్లులు ఆమోదించుకోవడానికి ఢిల్లీ వెళ్లి పాస్ అయ్యాకే హైదరాబాద్ తిరిగి రావాలన్నారు. కాంగ్రెస్(Congress) ,బీజేపీ(BJP) ల చేతిలో మరోసారి మోస పోవడానికి బీసీ లు సిద్ధంగా లేరన్నారు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరకు పంపగానే కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. బీసీ లకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు కోసం ఎందుకు ఆర్డినెన్స్ తేలేదన్నారు. ఢిల్లీ కి అఖిల పక్షం తీసుకెళితే మేము వస్తాం. ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్(BRS) రాష్ట్ర నాయకులు బాలరాజు యాదవ్, కె .కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, గౌతం ప్రసాద్ పాల్గొన్నారు.

Also Read: Srushti Fertility Centre: టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!