MLA Nayini Rajender Reddy: మాకు పుట్టిన బిడ్డకు లిక్కర్ రాణి పేరు పెట్టమని కోరడం హాస్యాస్పదంగా ఉంది. మామునూరు ఎయిర్ పోర్టుకు ఏం పేరు పెట్టాలో మాకు తెలుసు. ఇంకా నయం కవితమ్మ మ్యక్దోల్ విస్కీ. ఓటీ పేరు పెట్టమనలేదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) ఫైర్ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని డ్రామాలు చేసిన వందకు వంద శాతం ఆ కుటుంబం అంతా జైలుకు వెళ్ళబోతున్నారనే క్లారిటీ వాళ్లకు ఉంది. అందుకే రోజుకో కొత్త ఆరోపణలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఎన్ని వేషాలు వేసినా ఆ కుటుంబం పక్కా ఆధారాలతో జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పై KTR చేసిన ఆరోపణల పై నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. జోకర్ గాళ్ళు, కార్టూన్ గాళ్ళు వాళ్ళ ఇంటిని చక్కదిద్దడం చేతకాదు కానీ ఊరి గురించి మాట్లాడుతున్నారన్నారు.
సీసీ కెమెరా వీడియోలు ఉన్నాయి
బీజేపీ(BJP) బిఆర్ఎస్(BRS) విలీనం పై డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కాళేశ్వరం(Kaleshwaram) మేము కూల్చాము ఆరోపిస్తున్నారు. అప్పుడు మీ పార్టె అధికారంలో ఉందికదా అన్నారు. చుట్టూ పోలీస్ పహారా పెట్టి నిర్మాణం చేశారు కదా. సీఎం రమేష్ వ్యాక్యల పై కేటీఆర్(KTR) ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీఎం రమేష్ వద్ద నీ సీసీ కెమెరా వీడియోలు ఉన్నాయి అంటున్నాడు. బీజేపీ(BJO) లో BRS విలీనం చేయాలని చర్చలు జరపడం నిజం కదా అని ప్రశ్నించారు. నీ చెల్లి చేసిన ఆరోపణలే ఇప్పుడు సీఎం రమేష్ నిరూపిస్తా అంటున్నాడు.
Also Read: Ramchander Rao: పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాదు: రాంచందర్ రావు
హాస్టళ్ల తనిఖీ పేరుతో ఎవడన్నా నాటకాలు చేస్తే తోళ్ళు తీస్తాం బిడ్డా అని హెచ్చరించారు. ఐ ఏ ఎస్ అధికారులను అర్ధరాత్రి పిలిపించుకొని బెదిరించి సంతకాలు పెట్టించుకొని వందల ఎకరాలు దోచుకున్న నీచ చరిత్ర మీది అని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ చరిత్రను కిల్ చేసింది మీ కుటుంబమే. వరంగల్ ప్రజలకు మీ కుటుంబం ఎప్పటికైనా శత్రువే కేటీఆర్ దమ్ముంటే రా ఓపెన్ డిబేట్ పెడదాం అని సవాల్ విసిరారు. నేను చెప్పింది తప్పు అయితే నేను ముక్కు నేలకు రాస్తా నీది తప్పయితే రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవాలన్నారు.
నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు
వరంగల్(Waranagal) పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చాయని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి( MLA Rajender Reddy) తెలిపారు. ప్రధాన రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం హనుమకొండ జిల్లాల రూ.467 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అభివృద్ధి వరంగల్(Warangal) నగరంలో జరగబోతుంది. గతంలో అభివృద్ధి పలుకులు పలికిన నేతలు నేడు కనుమరుగయ్యారు. ఏక కాలంలో 205 కోట్ల నిధులను విడుదల చేసిన ఘనత కాంగ్రెస్(Congress) ప్రభుత్వంది అన్నారు. కార్టూన్ గాళ్లకు ఎలాంటి పనిలేక మాట్లాడుతున్నారని, పేపర్ మానేజ్మెంట్ కోసం రోజు తహతహలాడుతున్నారని నాయిని ఎద్దేవ చేశారు.