Ramchander Rao (imagecredit:swetcha)
Politics

Ramchander Rao: పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాదు: రాంచందర్ రావు

Ramchander Rao: భవిష్యత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchende Rao) స్పష్టంచేశారు. పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన వెల్లడించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆస్కార్ కాదని, అత్తారింటికి దారేది మూవీలో ఉన్న భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ ఎద్దేవాచేశారు. రేవంత్ మంచి యాక్టర్ అని, ఆయనకు నోబుల్ ప్రైజ్ కాదు గ్లోబల్ ప్రైజ్ ఇవ్వాలంటూ చురకలంటించారు. ప్రధాని మోడీ(PM Modhi) కన్వర్టెడ్ బీసీ అనడం వెనుకబడిన కులాలను అవమానించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. మోడీ కులాన్ని బీసీలో కలిపాకే ఆయన సీఎం అయ్యారని ఆయన గుర్తుచేశారు. ఇంతకీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులమేంటో కాంగ్రెస్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తాత ఒక పర్షియన్ అని, అయితే రాహుల్ మాత్రం బ్రాహ్మిణ్ అని చెప్పుకుంటున్నారన్నారు. రాహుల్ గాంధీకి గాయత్రి మంత్రం వచ్చా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గం ఎలా అవుతారని నిలదీశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ
పార్టీలో పోస్టుల కోసం తన వద్దకు ఎవరూ రావద్దని రాంచందర్ రావు శ్రేణులకు విజ్ఞప్తిచేశారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే లీడర్ అవుతారని, పోస్ట్ వచ్చినంత మాత్రాన వారంతా లీడర్లు కాదని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లుగా తనకు ఏ పోస్ట్ లేదని ఆయన గుర్తుచేశారు. శని, ఆదివారాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్(Mehabubnagar) జిల్లాలో పర్యటిస్తానని, తర్వాత ఖమ్మం(Khammam) జిల్లాలో తన పర్యటన ఉంటుందన్నారు. గ్రౌండ్ లో పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా(Amit sha), నడ్డా చెప్పారని పేర్కొన్నారు. దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ చూపడంపై రాంచందర్ రావు థ్యాంక్స్ చెప్పారు. ఇదిలా ఉండగా బీసీ కమిషన్ పెట్టిందే బీజేపీ(BJP) అని, తాము కూడా బీసీ(BC)ని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్(Congress) హామీ ఇచ్చి తమపై పెడితే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఎందుకు పెట్టలేదని, ఆర్డినెన్సు తేవాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. మిగతా కులాల లెక్క ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

బీఆర్‌‌ఎస్‌తో ఫెవికాల్ బంధం
ఫోన్ ట్యాపింగ్(Phone Taping) కేసులో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) షాడో బాక్సింగ్ చేస్తున్నాయని రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. బీజేపీకి మీడియాలో స్పేస్ దొరకకుండా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లో అధికారులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని, ఒక్క లీడర్ ను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్(Phone Taping) ఎక్విప్ మెంట్ ఎక్కడి నుంచి తెచ్చారన్నారు. రేవంత్(Revanth) కు, బీఆర్‌‌ఎస్(BRS) తో ఉన్న ఫెవికాల్ బంధం రోజురోజుకూ మరింత బలపడుతోందన్నారు. అందుకే రేవంత్ తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెబుతున్నారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి(Batti) తనపై చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. తానేం భయటపెట్టేందుకు నోటీసులు ఇవ్వలేదన్నారు.

Also Read: Mulugu District: భారీ వర్షంలో వాగు దాటుతూ నిండు గర్బిణీ ఆవస్ధలు

ఆయన అలా అనుకుంటే నోటీసులు పూర్తిగా చదవలేదని అనుమానం వస్తోందని చురకలంటించారు. జూబ్లీహిల్స్ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు టికెట్ అడుగుతున్నారన్నారు. జూబ్లీహిల్స్(Jublihills) ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారన్నారు. హైడ్రా(Hydraa)తో ఇల్లు కూల్చిన మాదిరిగానే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కూలడం ఖాయమని రాంచందర్ రావు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. హైడ్రాకు పేదవాడి ఇల్లు కూల్చినప్పుడు కనిపించని మానవత్వం.. ఫాతిమా కాలేజీ దగ్గర గుర్తువచ్చిందా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రా ఒక ఫెయిల్యూర్ వ్యవస్థగా చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక హైడ్రా ఉంచాలా? లేదా? అనేది ఆలోచిస్తామన్నారు.

అంతకుమించి ఏమీ లేదు
రాజాసింగ్(Raja Singh) విషయం అధిష్టానం చూసుకుంటుందని, అధిష్టానం పరిధిలో ఉన్న అంశంపై తాను మాట్లాడటం సరికాదని రాంచందర్ రావు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్(Congrss), బీఆర్ఎస్(BRS) ను చూశారని, అందుకే బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఢిల్లీ(Delhi)లో బీజేపీ(BJP) ఎంపీల మీటింగ్ రహస్యంగా జరగలేదని, తమ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారని, అందుకే మిగతా ఎంపీ(MP)లకు లంచ్ ఇచ్చారని, అంతకుమించి ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకున్నా.. తాము తమ పార్టీలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం సీట్లను బీసీలకు ఇస్తామని, మరింత ప్రాధాన్యత కల్పిస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చారు. అంతేకాకుండా తనకు స్టేట్ చీఫ్ పోస్టు ఇచ్చినంత మాత్రాన బీసీలకు అన్యాయం జరిగినట్లు కాదన్నారు. అయితే తాను కూడా బీసీ(బ్రాహ్మణ కమ్మూనిటీ)నే నంటూ రాంచందర్ రావు చమత్కరించారు.

నేడు రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 26, 27 తేదీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్(Mehabubnagar) జిల్లాలో పర్యటిస్తున్నారు. 26న మహబూబ్ నగర్, నారాయణపేట(Narayana Peta) జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. కాగా ఆయనకు షాద్ నగర్, బాలానగర్, జడ్చర్ల వద్ద బీజేపీ(BJP) నేతలు స్వాగతం పలకనున్నారు. ఆపై మహబూబ్ నగర్ చేరుకుని స్థానికంగా ఉన్న వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులతో సమావేశమవుతారు. అనంతరం మరికల్ మీదుగా నారాయణపేటకు వెళ్లి వివిధ వర్గాల నాయకులతో సమావేశమవ్వనున్నారు. ఈ మీటింగ్ తర్వాత గద్వాల చేరుకుని అక్కడే బస చేయనున్నారు. 27న గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు.

Also Read: Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో వీరు అనర్హులు.. పోటీకీ దూరం

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?