Sports Grounds (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Sports Grounds: రాష్ట్రంలో అలంకార ప్రాయంగా క్రీడా మైదానాలు

Sports Grounds: గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు ఆదరణ, నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. పాలకుర్తి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నేడు ఆటకు నోచుకోక వెలవెలబోతున్నాయి. క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఒక్కొక్క మైదానానికి రూ.లక్ష నుంచి 2 లక్షలు ఖర్చు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని పంచాయతీలకు నిధులు మంజూరు చేసి గుట్టలు, గట్లు, గతంలో ఉన్న పాఠశాల మైదానాల్లోనే క్రీడా మైదానం అని బోర్డులు ఏర్పాటు చేసి తూ తూ మంత్రంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. నేడు పూర్తిగా నిర్వహణ మరువడంతో క్రీడలకు నోచుకోక ప్రాంగణాల్లో గడ్డి, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమి మూలంగా అస్తవ్యస్తంగా మారాయి

నిరక్ష్యం నీడలో క్రీడ ప్రాంగణాలు
క్రీడా ప్రాంగణాల నిర్మాణం పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, దీనికి తోడు అధికారులు గాలికి వదిలేయడంతో అనేకచోట్ల కేవలం నామమాత్రంగా తయారయ్యాయి. చాలాచోట్ల ఊరికి దూరంగా ఉండటంతో వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేకపోవడంతో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో వెక్కిరిస్తున్నాయి. అలాగే క్రీడా ప్రాంగణాల నిర్వహణ లేకపోవడంతో పశువులకు ఉపయోగకరంగా మారాయి.

Also Read: CM Revanth Reddy: సీఎం సంతకం తర్వాత.. అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు

క్రీడా ప్రాంగణాల నిర్వహణకు తగిన చర్యలు
క్రీడలకు అవసరమైన పరికరాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. క్రీడా ప్రాంగణాలను స్థానికుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునేలా అధికారులు ఏర్పాటు చేయాలి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక దృష్టి వినియోగంలోకి తీసుకురావాలని మండల క్రీడాకారులు కోరుతున్నారు.

క్రీడా ప్రాంగణాలకు నిధులు కేటాయించాలి
క్రీడా ప్రాంగణాలకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వాణ కరువైందని మాలోత్ సురేష్(Maloth Suresh) అనే క్రీడాకారుడు విమర్శించారు. ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలకు నిధులు కేటాయిస్తే క్రీడాకారులు ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా నిధులు కేటాయిస్తే క్రీడాకారులు ఆటలపై ఆసక్తి కనబరుస్తారు. అలాగే ప్రభుత్వం ఆట వస్తువులను కూడా సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పారు.

Also Read: Panchayat elections: కుటుంబ ఓట్లు ఇతర వార్డుల్లో ఉంటే మార్పు చేర్పులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!