Panchayat elections (imagecredit:swetcha)
తెలంగాణ

Panchayat elections: కుటుంబ ఓట్లు ఇతర వార్డుల్లో ఉంటే మార్పు చేర్పులు

Panchayat elections: పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాను రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్ని సంఘం ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ సూచనలతో గ్రామం యూనిట్ గా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ తయారు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను రూపొందించి ఎంపీడీఓ(MPDO)ల లాగిన్ ద్వారా టీపోల్ పోర్టల్ లో నమోదు చేశారు. పంచాయతీలు, వార్డుల సంఖ్య పెరగడం లేదా తగ్గడంతో మళ్లీ ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్(EC) సూచన మేరకు అధికారులు జాబితా తయారీలో సన్నద్ధమయ్యారు.

వార్డుల వారీగా మళ్లీ జాబితా
ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందిస్తుండటంతో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. పాత జాబితా రూపొందించి ఇప్పటికే 6 నెలలు పూర్తయింది. ఈ ఆరు నెలల్లో 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా నమోదుతో పాటు మృతి చెందినవారుంటే వారి పేర్ల తొలగించనున్నారు. కొత్త ఓటర్లను వారి కుటుంబ సభ్యుల పోలింగ్ బూత్ పరిధిలో నమోదు చేస్తున్నారు. దీంతో గతంలో కేటాయించిన ఓటర్ల జాబితా సీరియల్ నెంబర్లు మారుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని వార్డుల వారీగా మళ్లీ జాబితా రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు ఒక కుటుంబానికి చెందిన సభ్యులు ఆవార్డులో కొంతమంది, మరో వార్డులో కొంతమంది పేర్లు ఉన్నాయి. దీంతో ఓటర్లు కొంత ఇబ్బందులు పడుతున్నారు. తమను ఒకేవార్డుకు కిందకు చేర్చాలని అధికారులు ఫిర్యాదులు చేశారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబ సభ్యులంతా ఒకే వార్డుకు కింద ఓటర్లుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఎంపీటీసీల సంఖ్యలో స్వల్ప మార్పులు
రాష్ట్ర వ్యాప్తంగా 71 గ్రామపంచాయతీలు జీహెచ్ఎంసీ(GHMC), నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కలిశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్​– మల్కాజిగిరి జిల్లాల్లోని పంచాయతీలు మున్సిపాల్టీల్లో విలీనం అయ్యాయి. దీంతో ఎంపీటీసీ(MPTC) స్థానాల డీలిమిటేషన్ చేశారు. అయితే ఈ గ్రామాల్లోని ఎంపీటీసీ(MPTC) స్థానాల పరిధిలో ఉన్న ఓటర్లను టీపోల్ యాప్ లో నమోదు చేస్తున్నారు. ఆయా మండల్లాలోని ఎంపీటీసీ స్థానాల పరిధిలోని కొంతమంది ఓటర్లను చేర్చుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 566 మండలాలు ఉన్నాయి. అందులో జిన్నారం, ఇంద్రేశం లను మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించింది. మండలం జాబితా నుంచి జిన్నారంను తొలగించడంతో మండలాల సంఖ్య 565 చేరింది.

Also Read: BC Reservation Bill: ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లకు బీజేపీ విరుద్దం: కిషోర్ రెడ్డి

ఇదిలా ఉంటే ఈ రెండింటి పరిధిలో దాదాపు 18 గ్రామపంచాయతీల వరకు ఉంటాయి. అవి పూర్తిస్థాయిలో మున్సిపాల్టీల్లో కలిస్తే ఇప్పుడున్న ఎంపీటీసీల సంఖ్యలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే ఛాన్స్​ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ 18 పంచాయతీల పునర్​వ్యవస్థీకరణ, మండల ప్రజా పరిషత్ (MPTC) డీలిమిటేషన్ కోసం త్వరలోనే షెడ్యూల్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే సెకండ్ ఫేజ్ లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అప్పుడు పూర్తిస్థాయిలో ఎంపీటీసీ స్థానాలు ఖరారు కానున్నాయి. ఈ పంచాయతీలకు మున్సిపాల్టీలు నోటిఫై చేస్తూ గెజిట్​విడుదల చేయాలి. పంచాయతీరాజ్​శాఖ వీటిని డీనోటిఫై చేయాలి. అయితే, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరుశాఖల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

మరణించినవారి పేర్ల జాబితా
ఈ ఏడాది జనవరి 6న తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విడుదల చేసింది. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను సీఈవో సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) ప్రకటించారు. జాబితా ప్రకారం, తెలంగాణ(Telangana)లో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళలు, 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,45,026 మంది 18-19 సంవత్సరాల ఓటర్లు, 2,22,091 మంది 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు, 3,591 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. 5,26,993 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అతి తక్కువగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు. అయితే మళ్లీ కొత్త జాబితా నమోదు, మరణించినవారి పేర్లను జాబితా నుంచి తొలగింపు కార్యక్రమం చేపడుతుంటంతో రాష్ట్ర ఓటర్ జాబితాలోనూ స్వల్పమార్పులు చోటుచేసుకోనున్నాయి.

నూతన ఓటర్ నమోదు చేపడుతున్నాం: ఎంపీడీఓ
18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఓటర్ల జబితాలో నమోదు చేస్తున్నాం. గతంలో ఒకే కుటుంబానికి చెందిన వారు రెండుమూడువార్డుల్లో ఉంటే వారందరిని ఒకే వార్డు కిందకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది అలాంటివారి వివరాలను సేకరిస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే వారి పేర్లను సైతం జాబితా నుంచి తొలగిస్తున్నాం. పకడ్బందీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నాం.

Also Read: Parliament: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్‌’పై చర్చ.. ముహూర్తం ఫిక్స్

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు