Maoist banners (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Maoist banners: చర్ల మండలంలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం

Maoist banners: కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్న మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెం(Kothagudem) గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిశాయి. కేంద్రం, చత్తీస్గడ్ రాష్ట్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్‌ని ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరుల ఆశయ సాధనకై ప్రజా యుద్ధాన్ని తీవ్రతరం చేద్దామంటూ సూచన చేశారు. గత ఏడాది 194 మంది కామ్రేడ్స్ ప్రభుత్వ ప్రతిఘాతక చర్యల్లో అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ ఏడాది బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వాల క్రూరమైన ఆపరేషన్ల మధ్య వారోత్సవాలను జరుపుకోవాల్సి వస్తుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ వీర యోధులు, వీర వనితలకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు పునరంకితమవుదామని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో కలిసి
మోడీ(Modhi) నాయకత్వంలో బిజెపి(BJP) 2047 వరకు బ్రాహ్మణీయ హిందూ రాజ్యం నిర్మించే లక్ష్యంతో సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ల ప్రయోజనాలను ప్రోత్సహిస్తుందని కరపత్రాల్లో వివరించారు. ప్రజాస్వామ్యాన్ని నాయ వంచనకు గురిచేసిన బిఆర్ఎస్(BRS) పార్టీని ప్రజలు అధికారంలోకి దించారని తెలిపారు. 6 గ్యారంటీలతోపాటు ప్రజాస్వామ్యం అని చెప్పిన కాంగ్రెస్(Congress) పార్టీకి అధికారం ఇస్తే ఆరు నెలల్లోనే ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలు, బ్రాహ్మణీయ హిందుత్వంపై పోరాడుతున్న వారిపై దాడులు చేసేలా ప్రయత్నం చేస్తుందన్నారు. సభలు సమావేశాలు నిషేధించి మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎన్కౌంటర్లు(Encounter), అక్రమ కేసులతో అమాయకులను అరెస్టు చేస్తున్నట్లు కరపత్రాల్లో పేర్కొన్నారు. 2017లో సమాధాన్, 2022లో సూరజ్ కండ్ ఆపరేషన్లు విఫలమయ్యాయని, 2024 జనవరి, 2025 మే నుండి ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో అత్యంత క్రూరమైన దాడులు కేంద్ర ప్రభుత్వం ప్రారంబించిందని తెలిపారు.

Also Read: CM Revanth Reddy: ఐడియాలజీ పాలిటిక్స్ నుంచి స్విగ్గీ రాజకీయాలు: రేవంత్ రెడ్డిమావోయిస్టు వారోత్సవాలను విజయవంతం
హిందుత్వ పాసింజర్ రెచ్చిపోయి దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్ల పై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఫాసిజం రాజ్యమేలుతుందన్నారు. ప్రగతిశీల శక్తులపై, హేతువాదులపై దాడులు కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ ఏడాది నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం మరింత దోపిడి, అణచివేతలను పెంచిందన్నారు. ఈ దాడులను ఎదుర్కొంటూ అమరులైన వీర పుత్రికలను, పుత్రులను స్మరించుకుంటూ మావోయిస్టు వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొమరం భీమ్(Komaram Bheem) మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ వర్గేష్, కామ్రేడ్ మంగు, కామ్రేడ్ రాజు, కామ్రేడ్ బుర్రాంలు మార్చి 19 గడ్చిరోలి జిల్లాలోని సి సిక్స్టీ కమాండో పోలీసుల చేతిలో అమరులయ్యారని తెలిపారు. పిట్ట పాడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసుల కాల్పుల్లో కామ్రేడ్ సాగర్, కామ్రేడ్ మణిరామ్, కామ్రేడ్ లక్ష్మణులు అమరులయ్యారని వివరించారు.

అమరుల స్మృతిలో
ఏప్రిల్ 16న కల్పర్ అపటోల ఎన్కౌంటర్లో(Culper Apatow Encounter) 29 మంది మావోయిస్టులు అమరులయ్యారని పేర్కొన్నారు. ఏప్రిల్ 30న ఠాకూర్ ఎన్కౌంటర్లో కామ్రేడ్ నాగన్న(Naganna), కామ్రేడ్ వినయ్(Vinay) సహా పదిమంది అమరులయ్యారని వివరించారు. కస్తూరి పాడు లో కామ్రేడ్ పాలి అనారోగ్యంతో, సెప్టెంబర్ 23న నదిలో మునిగి కామ్రేడ్ రామదార అమరులయ్యారన్నారు. ధర్మారం క్యాంప్ పై పి ఎల్ జి ఏ రైడ్లో కామ్రేడ్ దేవాల్, కామ్రేడ్ విక్రమ్, కామ్రేడ్ దేవా అమరులయ్యారని పేర్కొన్నారు. డిసెంబర్లో బీజాపూర్ లో కామ్రేడ్ నగేష్ అమరులయ్యారని వివరించారు. ఈ ఏడాది కాలంలో మొత్తం 194 మంది పైగా కామ్రేడ్స్, ప్రజలు ప్రాణాలర్పించారని పేర్కొన్నారు. నేటినుండి ఆగస్టు 3 వరకు సంస్కరణ వారాన్ని జరుపుతూ, అమరుల స్మృతిలో ప్రజలను పెద్ద ఎత్తున కదిలిద్దాం. అంటూ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, పత్రికా ప్రకటనల రూపంలో అమరుల ఆదర్శాలను ఎత్తిపట్టండని గ్రామాలలో బస్తీలలో కాలనీలలో అమరవీరుల స్థూపాలు నిర్మించి వారి త్యాగాలను ప్రచారం చేయండి అని, సభలు సమావేశాలు ఊరేగింపులు నిర్వహించి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని అమరవీరుల ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.

Also Read: Jupally Krishnarao: హరీశ్ రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బెటర్

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్