Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates (28-07-2025): బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్

Gold Rates (28-07-2025): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతారు, కానీ ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, జులై 28, 2025 నాటికి బంగారం ధరలు తగ్గాయి. దీంతో, మహిళలు  ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల  సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

24 క్యారెట్ల బంగారం ధర రూ.99,930 కి ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,600 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.99,930
వరంగల్: రూ.99,930
హైదరాబాద్: రూ.99,930
విజయవాడ: రూ.99,930

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.91,600
వరంగల్: రూ.91,600
హైదరాబాద్: రూ.91,600
విజయవాడ: రూ.91,600

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,24,000 గా ఉండగా, రూ.2,000 పెరిగి ప్రస్తుతం రూ.1,26,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,26,000
వరంగల్: రూ.1,26,000
హైదరాబాద్: రూ.1,26,000
విజయవాడ: రూ.1,26,000

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్