Vijay Deverakonda: రెండు, మూడు సినిమాలు హిట్ అవ్వగానే చిన్న హీరోలకి తెలియకుండానే పొగరు పెరిగిపోతుంది అనుకుంటా. దాదాపు విజయ్ దేవరకొండ స్టోరీ కూడా అలాంటిదే. పెళ్ళి చూపులు హిట్ అయిన తర్వాత నుంచి ఆటిట్యూడ్ చూపించాడు. ఇక అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత టాప్ హీరోస్ లిస్ట్ లోకి చేరి పోయాడు. ఇంకేముంది దానిని దృష్టిలో పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టాడు. లైగర్ తో టాప్ ప్లేస్ కి దూసుకెళ్ళనుకున్నా విజయ్ కి నెటిజన్స్ ఫ్లాప్ ఇచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు.
అప్పటి నుంచి ఒక్క హిట్ కూడా పడలేదు. చాలా కాలం నుంచి హిట్ పడక అల్లాడిపోతున్న విజయ్ దేవరకొండ ఈ సారైనా విజయాన్ని అందుకుంటాడా? లేదో చూడాలి. అయితే, తాజాగా ఈ రౌడీ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ జులై 26, 2025న విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సత్య దేవ్, భాగ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మూవీ పైన ప్రేక్షకులు చాలా ఆశలే పెట్టుకున్నారు.
Also Read: Kingdom Trailer: ఈ సారి ఎంకన్న సామి నా పక్కనుంటే టాప్ లో పోయి కూసుంటా.. విజయ్ దేవరకొండ
తాజాగా, కింగ్ డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడూతూ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశా.. ఈ సారి నా సినిమా కోసం పెద్ద వాళ్లే పనిచేస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్నమూరి, అనిరుధ్, నాగవంశీ, మా ఎడిటర్ నవీన్ నూలి. ఇంక మిగిలింది రెండే రెండు. ఆ వెంకన్న దయ, మీ ఆశీస్సులు. వాటితో ఈ మూవీ పెద్ద హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు అంటూ మళ్ళీ బలుపు మాటలు మాట్లాడాడు. ఈ మాటలే తగ్గించుకో.. లైగర్ దెబ్బ మర్చిపోయావా..? సినిమా ఆపేస్తే ఏం చేస్తావ్ అంటూ విజయ్ దేవరకొండ పై నెటిజన్స్ మండి పడుతున్నారు.
Also Read: KTR vs Ramesh: గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కవిత.. మళ్లీ తెరపైకి తెచ్చిన ఎంపీ సీఎం రమేష్