Kingdom ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kingdom Trailer: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్లో ఇవే హైలెట్.. మరి, ఈ సారి వెంకన్న స్వామి గెలిపిస్తాడా?

 Kingdom Trailer :

‘కింగ్‌డమ్’ ట్రైలర్ రిలీజ్

చాలా కాలం నుంచి హిట్ పడక అల్లాడిపోతున్న విజయ్ దేవరకొండ ఈ సారైనా ఆ విజయాన్ని అందుకుంటాడా? అయితే, తాజాగా ఈ రౌడీ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ జులై 26, 2025న విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సత్య దేవ్, భాగ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మూవీ పైన ప్రేక్షకులు చాలా ఆశలే పెట్టుకున్నారు.

ట్రైలర్ లో ఇవే హైలైట్స్:

విజయ్ దేవరకొండ పాత్ర: విజయ్ దేవరకొండ సూర్య అనే స్పై పాత్రలో కనిపిస్తాడు. అతను ఒక రహస్య మిషన్ కోసం గూఢచారిగా మారతాడు. రగ్గడ్ లుక్‌తో, యాక్షన్ సన్నివేశాల్లో అతని యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. శ్రీలంక సివిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో, అన్నదమ్ముల సెంటిమెంట్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. హీరో విజయ్‌తో పాటు సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. వీరిద్దరి మధ్య ఫైట్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటుంది. ఇంకా ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్ తో పాటు భావోద్వేగ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.  జైల్ ఫైట్, జాతర ఫైట్ సీన్స్, ఫారెస్ట్ చేజింగ్ సీక్వెన్స్‌లు కానిస్టేబుల్ రోల్ సీన్స్ అందర్ని ఆశ్చర్యపరస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ రూపొందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అవ్వనుంది.

ప్రేక్షకుల రియాక్షన్ ఇదే..

ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. “ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని రాక్షసులుగా మార్చేస్తుంది. వీడేమో రాక్షసులకు రాజై కూర్చున్నాడు” అనే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలరే ఇలా ఉందంటే, ఇక సినిమా బ్లాక్‌బస్టర్ నో డౌట్, విజయ్ దేవరకొండ యాక్షన్ హీరోగా అదరగొట్టాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ