KTR vs Ramesh (IMAGE credit: twiter)
Politics

KTR vs Ramesh: గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కవిత.. మళ్లీ తెరపైకి తెచ్చిన ఎంపీ సీఎం రమేష్

KTR vs Ramesh: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో విలీనం ఇష్యూ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై కోపంతో కవిత(KAVITHA) చేసిన వ్యాఖ్యలుగా అంతా భావించారు. కానీ, ఇప్పుడిప్పుడే ఆ వివాదం సద్దుమణిగింది అనుకునే లోపు ఏపీకి చెందిన బీజేపీ(BJP) ఎంపీ సీఎం రమేష్(Ramesh) ‘విలీనం’ బాంబ్ పేల్చారు. కవిత(Kavutha) వాదనలను సమర్థిస్తూ, కేటీఆర్ తనతో ఈ విలీన ప్రతిపాదనపై చర్చించినట్లు వెల్లడించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ వివాదం బీఆర్ఎస్‌ను ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పుకోవచ్చు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయ డైనమిక్స్‌‌పై కొత్త చర్చలకు తెరలేపింది. ఇదంతా కారు పార్టీకి పెద్ద డ్యామేజీగా మారిందని, పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో అని క్యాడర్ ఆందోళన చెందుతున్న పరిస్థితి.

Also Read: Vijay Deverakonda: బలుపు మాటలు తగ్గించుకో.. లైగర్ దెబ్బ మర్చిపోయావా..? విజయ్ దేవరకొండకి స్వీట్ వార్నింగ్ ఇస్తున్న నెటిజన్స్

చెల్లి పోరుతో మతి పోయిందా?
‘ కేటీఆర్(KTR)కాంట్రాక్టులు దక్కాయని చెబుతున్న రిత్విక్ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. రూ.1,660 కోట్ల కాంట్రాక్ట్ పనులకు సంబంధించి నాపై ఆరోపణలు చేయడం మూర్ఖత్వమే. సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై నేను కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెల్లి షర్మిలతో పోరు ఉన్నట్టే తెలంగాణలో కేటీఆర్‌కు కవితతో ఉన్నది. అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు పనుల కాంట్రాక్టులు వచ్చి 3 నెలల అయింది. అసలు ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పాటిస్తుందో పదేళ్లు మంత్రిగా చేసిన మీకు తెలియదా? 4 నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన కేటీఆర్ వచ్చారు.

చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన విషయం మర్చిపోయారా? పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తావా? టీడీపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో బయటపెట్టాలా? తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసిందని నేను అడిగినప్పుడు మా పార్టీకి కమ్మ వాళ్లు అవసరం లేదని, మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాలకు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తున్నాం నాతో చెప్పావా లేదా? తెలంగాణలో కూడా ఏపీలో మాదిరిగా కూటమి ఏర్పాటు అవుతుంది అప్పుడు బీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’ అని రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చర్చకు నేను రెఢీ..
సీఎం రమేష్ వ్యాఖ్యలకు మరోసారి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించి సవాల్ విసిరారు. ‘ సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే హెచ్‌సీయూ రూ.10వేల కోట్ల స్కాంపైనా, రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాం రెండిటిపైనా చర్చకు సిద్ధం. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు వచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు ఇచ్చింది.

ఇంతకన్నా దిగజారుడు రాజకీయం దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటదా? లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు, దానికి రూ.1660 కోట్ల కాంట్రాక్టా? హెచ్‌సీయూ భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకునే పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు. నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడటంతో అటెన్షన్ డైవర్షన్‌కు పనికి రాని కథలు చెబుతున్నారు. రూల్స్‌ను బ్రేక్ చేయడం, కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. నీ దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ రూ.1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయింది. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

క్యాడర్‌ ఆందోళన..
త్వరలోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో విలీన అంశం తెరపైకి గులాబీ పార్టీకి చెందిన నాయకులు, క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అసలు ఇప్పుడే ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు? బీఆర్ఎస్ పార్టీకి విలీనం అంశం డ్యామేజ్ అవుతుందని ఇలా చేస్తున్నారా? లేకుంటే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని, బీజేపీపై వ్యతిరేకత తెలంగాణలో వస్తున్న తరుణంలో ఈ అంశానికి తెరమీదకి తెచ్చారా? అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్ ఇప్పటికే బలహీన స్థితిలో ఉందన్నది జగమెరిగిన సత్యమే. ఈ నేపథ్యంలోనే విలీన చర్చల ఆరోపణలు పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కవిత, సీఎం రమేష్ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లోని అంతర్గత విభేదాలను, నాయకత్వ సంక్షోభాన్ని బహిర్గతం చేశాయని చెప్పుకోవచ్చు.

Also Read: Kingdom Trailer: ఈ సారి ఎంకన్న సామి నా పక్కనుంటే టాప్ లో పోయి కూసుంటా.. విజయ్ దేవరకొండ

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?