kingdom trailar ( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Kingdom Trailer: ఈ సారి ఎంకన్న సామి నా పక్కనుంటే టాప్ లో పోయి కూసుంటా.. విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కింగ్డమ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జెర్సీ’ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్ ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకు UA సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.

Read also- CM Revanth Reddy: ఐడియాలజీ పాలిటిక్స్ నుంచి స్విగ్గీ రాజకీయాలు: రేవంత్ రెడ్డి

విజయ్ దేవరకొండ చిత్తూరు యాసలో అదరగొట్టారు. ‘మన తిరుపతి ఏడుకొండల ఎంకన్న సామిగానీ ఈ ఒక్క సారి నా పక్కనుంచి నన్ను నడిపించినాడో చానా పద్దోడినై పుడుస్తా సామీ. టాప్ లో పోయి కూర్సొంటా ఎందుకంటే పానం పెట్టి పనిచేసిన. ఈ సారి సినిమాను చూసుకోవడానికి మంచోళ్లే ఉన్నారు. డైరెక్టర్ గైతమ్, మా పాలెగాడు అనిరుద్ పగలగొట్టాడు. ఎడిటర్ నవీన్ నూలి ఉన్నాడు. ప్రొడ్యూసర్ నాగవంశీ ఉంన్నాడు. హీరోయిన్ భాగ్యశ్రీ ఉన్నాది.’ అంటూ చెప్పుకొచ్చారు. ‘తిరుపతి నాకు రెండో హోమ్ అందుకే ఇక్కడ ప్లాన్ చేశాను ట్రైలర్ రిలీజ్. ఈ సినిమా అయిదు సంవత్సరాల ప్రాజెక్ట్ ప్రాణం పెట్టి చేశాం.’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే ‘నేనే ఉండాలనుకున్నా మీ హృదయంలో’ అంటూ క్యూట్ క్యూట్ గా మాట్లాడారు.

Read also- Nitish Reddy: చిక్కుల్లో క్రికెటర్ నితీష్ రెడ్డి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, గౌతమ్‌ తిన్ననూరి కలిసి ముచ్చటించారు. దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ ఇచ్చిన కిక్ ఎలాంటిది అంటే ఆ సినిమాలాగే అన్నీ అన్నీ హిట్‌ అవుతాయని ఓ సినిమా రిలీజ్ ఈవెంట్ లో పందెం కాసేవాడిని. కానీ, సినిమాలు చేస్తున్న కొద్దీ అర్థమైందేంటంటే, ఏది హిట్‌ అవుతుందో.. ఏది కాదో.. శుక్రవారం మూవీ విడుదలయ్యే వరకూ నాకే కాదు, ఎవరికీ తెలియదు. ప్రస్తుతం సినిమా నా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ నలుగురి చేతుల్లోనే ఉంది. అందుకే నేను జై గౌతమ్‌, జై అనిరుధ్‌ , జై నవీన్‌ నూలీ, జై శ్రీరామ్‌ (దేవుడు) అంటున్నాను’ అని విజయ్‌ దేవరకొండ అనన్నారు. ‘‘పెళ్లి చూపులు’ సినిమా విడుదలకు ముందు ఒక సారి విజయ్‌ను కలిసి ‘మళ్లీ రావా’ కథను చెప్పాను. అది ఎందుకో వర్కవుట్‌ కాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు ‘కింగ్డమ్‌’ సినిమాతో కలిసి పనిచేశాం. ’ అంటూ ఈ సినిమా దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి చెప్పుకొచ్చారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?