Bakki Venkataiah (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Bakki Venkataiah: ఎస్సీ ఎస్టీల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలే!

Bakki Venkataiah: ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సీ(SC), ఎస్టీ(ST) కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య(Venkataiah) హెచ్చరించారు. మేడ్చల్(Medchal) జిల్లా నారపల్లి కొర్రంల గ్రామం లక్ష్మీ నగర్ కాలనీలో జగద్గురువు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj) విగ్రహాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమీషన్ సభ్యులు రమావత్ రాంబాబు నాయక్‌లు ఆవిష్కరించారు.

వారి హక్కులను భంగం కలిగిస్తే
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ(Telangana) రాష్ట్రం కమిషన్ ఎస్సీ(SC) ఎస్టీ(ST) హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని, హక్కులకు ఆటంకం కలిగించిన వారిపై ఇప్పటికే అనేక శిక్షలు వేయించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు కాపాడడానికి తెలంగాణ(Telangana) ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజన సమాజానికి ఒక ఆధ్యాత్మిక మహనీయుడని పేర్కొన్నారు.

వారి స్ఫూర్తితో సేవాలాల్ మహారాజ్ ఆశయాల కోసం సేవలందించడానికి సేవాలాల్ మహారాజ్ సేవా ఎడ్యుకేషన్ సొసైటీ సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్(Rambabu Nayak), ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు రమణ(Ramana), గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ శీను రాథోడ్, మహిళా రాష్ట్ర అధ్యక్షులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Also Read: Minister Sridhar Babu: పారిశ్రామికాభివృద్ధికి అపార అవకాశాలు..

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!