Shadnagar Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shadnagar )పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కూతుళ్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్ నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైక్ ఇస్తున్న ఢీకొట్టడంతో పట్టణానికి చెందిన మచ్చేందర్ అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడ కన్నీరు పెట్టించింది.
Also Read: Chandrayangutta Crime: చిన్నప్పటి స్నేహితుడిని కత్తితో పొడిచి దారుణ హత్య..
బస్ స్టేషన్ వస్తుండగా
మైత్రికి వస్తున్న తన స్నేహితురాల ఫోన్లో ఇతరుల ఫోన్లకు తయ్యబ్ సమాచారం తెలియజేశారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయమై పట్టణ సీఐ విజయ్ కుమార్(CI Vijay Kumar) మాట్లాడుతూ తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయారని సిఐ తెలిపారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్(Bus station) వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ తెలిపారు. శవాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు
Also Read: Medchal District Crime: చాకలి ఐలమ్మ మనవరాలి హత్య.. కన్నతల్లినే చంపిన కూతురు!