MLA Dhanpal Suryanarayana: నిజామాబాద్ నగరంలో రోజురోజుకు సమస్యలు తీష్టవేస్తున్నప్పటికీ స్థానికంగా ఎన్నికైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) పరిపాలనలో పట్టు సాధించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారులను, యంత్రాంగాన్ని సమన్వయపరిచి ప్రజల అవసరాలు తీర్చడంలో ఎమ్మెల్యే విఫలం చెందుతున్నారని నగర ప్రజలు నిరాశకు లోనవుతున్నారు. అర్బన్ నియోజకవర్గం గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విస్తరించి కొన్ని గ్రామాలను విలినం చేశారు. కొత్తగా వచ్చిన కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్‌తో సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ తదితర సమస్యలను త్వరత్వరన పూర్తి చేయాల్సిన ఎమ్మెల్యే అటువైపు దృష్టిసరించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడే
ప్రారంభోత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పూర్తిస్థాయి సమయం కేటాయిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నాడని నగర ప్రజలు గుసగుసలాడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నగర ప్రజలు బిజెపి(BJP) అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణకు(Dhanpal Suryanarayana) భారీ మెజార్టీ కట్టబెట్టి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై సుమా రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడే అన్న చందంగా మారింది. అధికార పార్టీపై నిధులు ఇవ్వడం లేదని ఆరోపణ చేయడం తప్ప స్థానికంగా నెలకొన్న సమస్యలు గుర్తించడంలో ఎమ్మెల్యే తనదైన మార్కును ప్రదర్శించడం లేదని ప్రజలు భావిస్తున్నారు.
తాము ఎన్నుకున్న నాయకుడు పనితీరు ఇలా ఉందని విస్తీ పోతున్నారు. నగరంలోని 60 డివిజన్లు ఉండగా సుమారు ఐదున్నర లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఎమ్మెల్యే మెరుగైన పనితీరు ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా స్థానిక ప్రజా ప్రతినిధి వ్యవహారం ఉందని చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే(MLA) పై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశకు లోనవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
Also Read: Bhadradri Kothagudem: కోట్లు దండుకుంటున్న కాంట్రాక్టర్.. ఆందోళనలో గిరిజనులు
ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం
ప్రభుత్వ శాఖలపై పట్టు సాధించి స్థానికంగా నివసించే నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి కరిచిన రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు చేయించలేని అసమర్థతను వీడి మేధావులు, నగరాభివృద్ధి పట్ల అవగాహన ఉన్న వర్గాలతో సమన్వయంగా మెలిగి ప్రజల అవసరాలను తీర్చాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గుర్తించాలని మేధావులు భావిస్తున్నారు. ప్రజా సమస్యలు తీర్చడానికి మాత్రం అధికారులు నగర ప్రజల సమన్వయం చేసి పనులు చెక్కపెట్టాలని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో సరిపెట్టకుండా ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించి ఎమ్మెల్యే పై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవాలని కోరుతున్నారు. అధికారం కట్టబెట్టినందున ప్రజల నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఇప్పటికైనా ఏకపక్ష దూరంవీడి ఎన్నుకున్న ప్రజల సమస్యలు తీర్చాలని ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఇకనైనా ఓట్లేసి గెలిపించిన ప్రజల పొందాలని క్షేత్రస్థాయి పరిటాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవాలని కోరుతున్నారు.
Also Read: BC Reservation Bill: బీజేపీ పోరు బాట.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్