Odisha
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: టీనేజర్‌పై అన్నదముళ్ల అఘాయిత్యం.. ప్రెగ్నెంట్ అని తెలియగానే..

Viral News: మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నియంత్రణకు (Viral News) ప్రభుత్వాలు, వ్యవస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా, ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. బనశ్బర గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై ఇద్దరు అన్నదముళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో, బాలిక గర్భం దాల్చింది. ఐదు నెలల తర్వాత ఈ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న నిందితులు తాము చేసిన పాడుపనిని దాచిపెట్టేందుకు బాలిక బతికుండగానే పాతిపెట్టే ప్రయత్నం చేశారు.

అబార్షన్ చేయించుకోవాలంటూ బాలికపై నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. మాట వినకపోవడంతో హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ఒక గుంతను కూడా తవ్వి ఉంచారు. గుంత వద్దకు పిలిచి మరీ బాలికను బెదిరించారు. అబార్షన్ చేయించుకోకపోతే బతికుండగానే పాతరేస్తామంటూ హెచ్చరించారు. భయభ్రాంతులకు గురైన బాలిక, కాస్త తేరుకొని చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. వెళ్లి తండ్రికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేయడంతో నిందితులు భాగ్యధర్ దాస్, పంచానన్ దాస్ అనే ఇద్దరు అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మూడవ నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచినట్టు వెల్లడించారు.

బాధిత బాలికతో పాటు నిందితులు ఒక మఠంలో పనిచేస్తున్నారు. బాలికను నిందితులు చాలాసార్లు చెప్పలేని విధంగా ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. గర్భవతి అని తెలియగానే, విషయాన్ని దాచిపెట్టేందుకు అబార్షన్ చేయించుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కుజాంగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.

Read also- Sad News: ఘోరవిషాదం.. స్కూల్లో ఏడుగురు విద్యార్థుల మృతి

కాగా, ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలో ఈ వారంలో జరిగిన రెండవ అఘాయిత్య ఘటన ఇది. మంగళవారమే ఒక ఘటన నమోదయింది. పుట్టినరోజు పార్టీ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ఓ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి పొలాల్లోకి తీసుకెళ్లి పాడుపనికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావ స్థితిలో ఉన్న బాధితురాలి కొందరు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో కూడా ఆదివారం ఓ ఘటన జరిగింది. ఓ బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక దారుణానికి ఒడిగట్టారు. నిందితుల నుంచి తప్పించుకున్న ఇంటికి తిరిగి వెళుతున్న బాధితురాలపై ఓ ట్రక్ డ్రైవర్ కూడా అఘాయిత్యం చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఒడిశాలో వరుసగా దారుణాలు
ఈ తరహా ఘటనలకు సంబంధించి ఒడిశాలో గత నెల జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా తక్కువలో తక్కువ 12 కేసులు నమోదయ్యాయి. జూన్ నెలలో తొలి10 రోజుల్లోనే 5 కేసులు, సామూహిక దాడి ఘటనలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన రాష్ట్రంలోని బాలాసోర్‌లోని ఫకీర్ మొహన్ కాలేజీలో జరిగింది. ఓ 20 ఏళ్ల విద్యార్థిని తనకు ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేయగా, కాలేజీ నిర్వాహకులు తోసిపుచ్చారు. దీంతో, తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత విద్యార్థిని తనకు తానే నిప్పంటించుకొని చనిపోయింది. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన మరో సంచలన ఘటన పూరీ జిల్లాలో జరిగింది. నిర్మపాడ బ్లాక్‌కు చెందిన 15 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి కాల్చివేశారు. తీవ్రంగా గాయపడిన మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు విమానంలో తరలించారు.

Read Also- OTT Platforms: 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు