Rahul Gandhi (IMAGE CREDIT: TWITTER)
జాతీయం

Rahul Gandhi: కాల్పుల విరమణపై ట్రంప్.. 25 సార్లు చెప్పడమేంటి?

Rahul Gandhi: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణను కుదిర్చింది తానేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)25సార్లు చెప్పుకున్నారంటే, తెర వెనుక ఏదో జరిగి ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చడానికి ట్రంప్ ఎవరు? అని ప్రశ్నించారు. అది ట్రంప్ చేయాల్సిన పని కానే కాదని.. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎందుకు సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు.

Also Read: CM Revanth Reddy: 42శాతంపై ఎందుకు స్పందించడం లేదు.. లోక్‌సభలో రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం

ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ అంశంపై విపక్షాలు చేస్తున్న డిమాండ్‌కు ప్రధాని అంగీకరించే అవకాశమే లేదన్నారు. ఒకవేళ దీనిపై ప్రధాని ప్రకటన చేయాల్సి వస్తే, ట్రంపే భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారని చెప్పాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పేందుకు మోదీ అంగీకరించరు కానీ, అదే నిజమని రాహుల్ స్పష్టం చేశారు. ట్రంపే భారత్-పాక్‌లతో కాల్పుల విరమణ చేయించారని, ఈవిషయం యావత్ ప్రపంచానికి తెలుసన్నారు.

కచ్చితంగా చర్చిస్తాం..
‘ ఆపరేషన్ సింధూర్‌ను ఆపానని ట్రంప్ 25 సార్లు చెప్పుకోగా, అది ఇంకా కొనసాగుతోందని మోదీ సర్కారు వాదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్‌లో విజయం సాధించామని చెబుతూనే, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పడంలో అర్ధం లేదు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలన్నీ చూస్తుంటే, ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. తెర వెనుక ఏదో జరిగి ఉంటుందనే నాకు అనిపిస్తోంది. భారత విదేశాంగ విధానాన్ని మోదీ సర్కారు ధ్వంసం చేసింది. అఖిలపక్ష ఎంపీల పర్యటనల వల్ల మన దేశాన్ని ఏ ఒక్కరూ సమర్ధించలేదు.

కాల్పుల విరమణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇంతకంటే పెద్ద సమస్యల గురించి మేం పార్లమెంటులో చర్చించాలని భావిస్తున్నాం. రక్షణ రంగం, రక్షణ రంగ పరిశ్రమలు, ఆపరేషన్ సింధూర్‌పై చర్చిస్తాం. ప్రస్తుతం పరిస్థితేం బాగా లేదని యావత్ ప్రపంచానికి తెలుసు. తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వంలోని వారు పారిపోవాల్సి వచ్చింది. ఈ అంశాలపై కనీసం ఒక్క ప్రకటనను కూడా ప్రధాని మోదీ చేయలేకపోతున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే, ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంటులో చర్చిస్తామని కేంద్రం చెప్పింది’ అని రాహుల్ వెల్లడించారు.

 Also Read: HHVM Pre Release: ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ .. అందుకేనా అలా అంటారు

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?