Mahalakshmi Scheme: ఇదే కందా ప్రభుత్వం కోరుకునేది
Mahalakshmi Scheme (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahalakshmi Scheme: ఇదే కదా ప్రభుత్వం కోరుకునేది: మంత్రి కొండా సురేఖ

Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకంతో మహిళలకు సాధికారత చేకూరుతున్నదని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణం చేసి 66 80 కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా వరంగల్ ఆర్టీసీ(RTC) బస్ స్టేషన్ లో నిర్వహించిన సంబరాల్లో మంత్రి కొండ సురేఖ(Min Konda Sureka) ముఖ్యఅతిథిగా హాజరై, నగరమేయర్ శ్రీమతి గుండు సుధారాణి(Sudha Rani), జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Collector Satya Sarada), సిడబ్ల్యుఎంసీ కమిషనర్ చాహత్ వాజ్పాయిలతో కలిసి కేక్ కట్ చేశారు. మహాలక్ష్మి తో మహిళా సాధికారతపై విద్యార్థులకు, మహిళలకు నిర్వహించిన వ్యాసరచన, రంగోలి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలచే ఏర్పాటుచేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్స్‌ను మంత్రి, మేయర్, కలెక్టర్లు పరిశీలించారు.

ఇతర రాష్ట్రాలు కూడా అమలు
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో ప్రతి మహిళలో చిరునవ్వు కనబడుతోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మహిళలకు అసలైన గౌరవం దక్కుతున్నదన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి వరంగల్(Waranagal) జిల్లాలో ఇప్పటివరకు 15.43 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించడం ద్వారా 690 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగా, వరంగల్ జిల్లాలో 4.54 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి 190 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని మంత్రి తెలిపారు.

Also Read: Counterfeit Liquor: సూర్యాపేట కల్తీ మద్యం దందాలో ఆంధ్రా వ్యక్తులు

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా సెర్ప్ ఆధ్వర్యంలో ఆర్టీసీ(RTC) లో అద్దెపై బస్సులు నిర్వహించుటకు మహిళా సంఘాలకు బస్సు తాళాలు మంత్రి అందజేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఐదు మహిళా సంఘాలకు ఐదు ఆర్టీసీ బస్సులను అద్దెపై నిర్వహించుటకు త్వరలో అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఉపాధి కల్పించేలా చర్యలు
ఆర్టీసీ బస్టాండ్లలో మహిళా సంఘాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుటకు స్టాల్స్ కేటాయించాలని అధికారులకు సూచించారు. ఉచిత బస్సు(Free Buss) ప్రయాణం వల్ల దేవదాయ శాఖకు అదనంగా 176 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని మంత్రి తెలిపారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో మహిళల స్వాలంబనే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిడబ్ల్యుఎంసి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేసి మహిళలకు శిక్షణ ఇప్పించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Collector Satya Sarada) మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ అనిల్, డిఆర్డిఓ కౌసల్యా దేవి, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భాను కిరణ్, డిపో మేనేజర్, ధరమ్ సింగ్, తహసిల్దార్ ఇక్బాల్ మెప్మాడి ఎం సి రేణుక, టీఎంసీ రమేష్, సంబంధిత శాఖల అధికారులు, మహిళలు ప్రయాణికులు పాల్గొన్నారు.

Also Read: Bhairavam OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న ‘భైరవం’.. రికార్డుల వేట మొదలైంది!

 

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..