Tularam project: భారీ వర్షాలకు మత్తడి పోస్తున్న తులారం ప్రాజెక్ట్!
Tularam project (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Tularam project: భారీ వర్షాలకు మత్తడి పోస్తున్న తులారం ప్రాజెక్ట్!

Tularam project: ప్రకృతి వలయానికి ఆలవాలయమైన తులారం ప్రాజెక్టు(Tularam Project) (బి ఎన్ గుప్తా) అలుగు పోసింది. ప్రకృతి నిలయానికి ప్రత్యక్ష సాక్షిగా ఉదాహరించే తులారం ప్రాజెక్టు అలుగు పోయడంతో పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు గుంపులు గుంపులుగా సందర్శించి తిలకించి సందడి చేశారు. మహాబాబూబాద్ జిల్లా(Mahababuabad District) బయ్యారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద చేరడంతో తులారం ప్రాజెక్టు మత్తడి పోయడంతో దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పొంగి పొర్లుతున్న పాకాల ఏరు
మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గార్ల పాకాల ఏరు ప్రమాదకర స్దాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. పలితంగా రాంపురం(Rampuram), మద్దివంచ, గ్రామపం చాయతీల పరిదిలోని 20 గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాల(Rain)తో గార్ల పాకాల ఏటికి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండంతో వాహనాలు, ప్రజల రాకపోలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో ప్రమాదవశాత్తు కొందరు వ్యక్తులు జారిపడి మరణించడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా గార్ల పోలీసులు ముందస్తుగా భారీకేడ్స్ ఏర్పాటుచేసి, పోలీసు(police)లతో పాటు రెవిన్యూ వారు సైతం ప్రహరాకాస్తున్నారు.

Also Reda: Bhatti Vikramarka: దళిత బంధు లబ్ధిదారులకు నిధుల జమ.. భట్టి విక్రమార్క

వాతావరణ శాఖ హెచ్చరికలు

రానున్న 4,5, రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు చేసింది. ఈ నేపధ్యంలో రైతులు(Farmers), ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవస పరిస్థితులలో తప్ప బయటికి రాకూడదని, చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసులకు, రెవిన్యూ, గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై రియాజ్ పాషా(SI Riaz Pasha) సూచించారు.

Also Read: Dhankhar: ధన్‌ఖడ్ రాజీనామాలో సంచలన కోణం!?.. అంత జరిగిందా?

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..