Prabhas ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas: బాహుబ‌లి పాత్ర కోసం.. ప్ర‌భాస్ రోజుకి అన్ని గుడ్లు తీసుకున్నాడా.. డైట్ లిస్ట్ చూస్తే మతి పోవాల్సిందే!

Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. బాహుబలి (పార్ట్ 1, 2) సినిమాతో నటుడు ప్రభాస్ సాధించిన గుర్తింపు అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో నటించాడు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు). ఈ రెండు పాత్రల్లోనూ ప్రభాస్ అద్భుతమైన నటనతో పాటు శారీరకంగా కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు.

అమరేంద్ర బాహుబలి పాత్రలో ఆయన భారీ శరీరాకృతితో, రాజసం నిండిన రాజుగా కనిపించాడు. అయితే శివుడు పాత్రలో సన్నగా, సాధారణ వ్యక్తిగా కనిపించాడు. ఈ రెండు లుక్‌ల కోసం ప్రభాస్ తీవ్రమైన కృషి చేశాడని తెలుస్తోంది. ముఖ్యంగా, అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన డైట్ చేసాడని సినీ వర్గాల నుంచి సమాచారం.

Also Read: Ambati Rambabu: వీరమల్లుపై అంబటి ట్వీట్.. ఏం తాతా ప్రీమియర్ టికెట్స్ దొరకలేదా? అంటూ కామెంట్స్!

ఒక సమయంలో ప్రభాస్ డైట్, వ్యాయామం చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారట. అయినప్పటికీ, అంతా మంచిగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ పాటించిన డైట్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

బ్రేక్‌ఫాస్ట్: ఉదయం  42 ఉడకబెట్టిన కోడిగుడ్డు సొనలు (తెల్లని భాగం మాత్రమే), వీటితో పాటు పచ్చి గుడ్లను కూడా తాగేవాడట.. మళ్లీ  పావు కిలో చికెన్, ఐదు రకాల పండ్లు తీసుకునేవాడు.

Also Read: Hyderabad Floods: వర్షపు నీటి ప్రవాహానికి ‘లైన్ క్లియర్’.. నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న హైడ్రా అధికారులు

మధ్యాహ్న భోజనం : బ్రౌన్ రైస్, ఓట్స్, పాస్తా, బ్రకోలి, సలాడ్స్, ప్రోటీన్ పౌడర్, సూప్, పాలులను తీసుకునేవాడు.

రాత్రి పూట భోజనం : పుల్కాలు, చికెన్, పండ్లు, పాలు వంటి వాటిని రాత్రి భోజనంలో తీసుకునేవాడు.

Also Read: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా పైన నా అన్వేష్ సంచలన వీడియో.. అదంతా అబద్ధమా? నిజమా?

వ్యాయామం

ఇక వ్యాయామం విషయానికొస్తే, అంత డైట్ ను పాటిస్తూ కూడా ప్రభాస్ రోజూ మూడు గంటలకు పైగా జిమ్‌లో వ్యాయామం చేసేవాడని చెబుతున్నారు. ఈ కఠినమైన డైట్, వ్యాయామాతో అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం అవసరమైన భారీ శరీరాకృతిని సాధించాడు. దీని వెనుక ఇంత కష్టం ఉంది కాబట్టే సినిమాలో ఆయన అద్భుతంగా కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం