Hyderabad Floods ( Image Source: Twitter)
తెలంగాణ

Hyderabad Floods: వర్షపు నీటి ప్రవాహానికి ‘లైన్ క్లియర్’.. నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న హైడ్రా అధికారులు

 Hyderabad Floods: వర్షాలు కురిసినప్పుడు వరద ముంచెత్తకుండా హైడ్రా క్షేత్రస్థాయిలో నిరంతర చర్యలు చేపట్టింది. ఆర్‌యూబీలు, ఫ్లై ఓవర్లను పరిశీలించి ఎక్కడా నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. గత రెండు, మూడు వర్షాలు నేర్పిన పాఠాలను హైడ్రా పరిగణలోకి తీసుకుని, మళ్లీ అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలను ముమ్మరం చేసింది. ఫ్లై ఓవర్ వంతెనలపై నీరు వెళ్లేందుకు ఉన్న రంధ్రాలను తెరిపిస్తుంది.

Also Read: Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!

కొండాపూర్‌లోని కొత్తగూడ ఫ్లై ఓవర్, హాఫీజ్‌పేట్ ఫ్లై ఓవర్ పైన ఉన్న రంధ్రాలన్నీ హైడ్రా తెరిపించినట్లు అధికారులు తెలిపారు. అలాగే నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లపై వర్షం నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. మదీనగూడ దగ్గర నాలా క్లీనింగ్ పనులు చేపట్టినట్లు కూడా వెల్లడించారు. ఆర్‌యూబీల వద్ద సంపులు నిర్మించి ఆటోమేటిక్‌గా నీటిని తోడే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Also Read: Pawan Kalyan: దేవుడి దయ ఉంటే ఆ సినిమా చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్

అవి కొన్ని చోట్ల పని చేయకపోవడం, సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో తలెత్తిన ఇబ్బందుల పరిష్కారంపై హైడ్రా దృష్టి పెట్టింది. మంగళవారం మెహిదీపట్నం, మాదాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నప్పుడు హైడ్రా ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో ఉండి, వరద నిలవకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే చింతల్, ఎల్‌బీనగర్ ఆర్‌యూబీలను కూడా హైడ్రా అధికారులు పరిశీలించారు. కాటేదాన్ అండర్ పాస్ (ఆర్‌యూబీ) వద్ద నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేశారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ఆర్‌ఎఫ్‌ఓ జయప్రకాష్, డీఎఫ్‌ఓ యజ్ఞనారాయణ తదితరులు క్షేత్ర స్థాయిలో ఈ పనులను పరిశీలించినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.

Also Read: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా పైన నా అన్వేష్ సంచలన వీడియో.. అదంతా అబద్ధమా? నిజమా?

Just In

01

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!

Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!

Telangana Politics: కాంగ్రెస్ స్కెచ్‌కి ఇరుక్కుపోయిన బీఆర్ఎస్.. ఎలా అంటే..?

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్