Tiger Attack: ఈ మద్యకాలంలో పులుల సంచారం ఎక్కువగా మానవులు నివసించే ప్రదేశంలో సంచరిస్తున్నాయి. గతంలోను ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే నంద్యాల జిల్లాలో ఓ యువకునిపై పెద్దపులి దాడిచేసిన సంఘటన కలంకలం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెలితే.. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సందరంపేటలో పులిచెర్ల అక్కన్న అనే యువకుని పై సోమవారం నాడు ఓ పెద్దపులి దాడి చేసింది. నిన్న రాత్రి బహిర్భూబికి వెల్లిన యువకుడు పెద్ద పులిని చూసి పొదల్లోకి దాక్కుని ఉన్నాడు.
ఈ క్రమంలో యువకుడిని చూసిన పులి ఒక్కసారిగా అరుస్తూ అతని పైకి వచ్చి దాడి చేసింది. దీంతో భయాందోళనకు గురైన యువకుడు వెంటనే కేకలు వేశాడు. యువకుడి కేకలు విన్న గూడెం ప్రజలు పెద్ద ఎత్తున కేకలు వేసుకుంటూ అతడి వద్దకు రావడంతో పెద్దపులి యువకున్ని వదిలి పారిపోయింది. స్ధానికుల ద్వారా సమాచారం అందుకన్న అటవిశాఖ అధికారులు వెంటనే యువకుడిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Live in Relationship: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. నాలుగేళ్లుగా సహజీవనం.. సీన్ కట్ చేస్తే!
పెద్దపులి దాడి సంఘటన జరగడంతో ఆ గ్రామంలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అటవి సమీపంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఓంటరిగా భయటికి వెల్లాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలో పెద్దపులి దాడిలో గాయపడిన యువకుడు ప్రాణాలతో భయట పడటంతో స్దానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.