V.S. Achuthanandan: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ (V.S. Achuthanandan) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈయన 2006 నుంచి 2011లో కేరళ (Kerala) ముఖ్యమంత్రిగా పని చేశారు. 1923 అక్టోబర్ 30న నిరుపేద కుటుంబంలో జన్మించారు.
పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలో చదువు మానేశారు. చిన్న వయసులోనే కార్మికుడిగా కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1940లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అయ్యారు. అంచలంచెలుగా ఎదుగుతూ సీఎం స్థాయికి ఎదిగారు. 1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను వదిలేసి సీపీఎం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. వామపక్ష పార్టీలో చీలిక సమయంలో సీపీఎంను స్థాపించిన లీడర్లలో అచ్యుతానందన్ ఒకరు. ఒకసారి సీఎం, మూడుసార్లు విపక్ష నేతగా పని చేశారు.
Also Read: Kerala Rains: వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. ఆ రాష్ట్రానికి రెడ్ అలర్ట్!
ప్రధాని మోదీ సహా ప్రముఖుల విచారం
అచ్యుతానందన్ న్ (V.S. Achuthanandan) మృతిపై ప్రధాని మోదీ (Modi ) విచారం వ్యక్తం చేశారు. కేరళ (Kerala) పురోగతి కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. వీఎస్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన మోదీ, (Modi ) వాళ్లిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన విషయాలను గుర్తు చేశారు. అచ్యుతానందన్ (V.S. Achuthanandan) కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని నష్టం జరిగిందని సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్ర సంతాపం తెలిపింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, (Revanth Reddy) చంద్రబాబు (Chandrababu) కూడా సంతాపం తెలిపారు.
Also Read: Youtube New Rules: రూల్స్ మార్చిన యూట్యూబ్… ఇకపై వారికి కుదరదు