Kerala Rains: వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.
Kerala Rains (iamgecredit:twitter)
Telangana News

Kerala Rains: వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. ఆ రాష్ట్రానికి రెడ్ అలర్ట్!

Kerala Rains: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందగానే వచ్చేశాయి. వాతావరణ శాఖ అంచనాలను మించి వేగంగా కదులుతున్న ఈ రుతుపవనాలు ఇప్పటికే సౌత్ ఇండియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో అధిక వర్షాలు పడేఅవకాశం ఉన్నందున కేరళ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ (IMD) జారీ చేసింది. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కేరళ రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరియు మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిది. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఆగకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం ఎక్కడికక్కడే నిలిచి పోయింది.

Also Read: Ponnam Prabhakar: విధుల్లో నిజాయితీగా పనిచేయాలి.. రవాణాశాఖకు మంచి పేరు తేవాలి!

నిన్న రాత్రి నుంచి కోయంబత్తూర్‌, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో నీలగిరి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిపి వేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాగులు వంకలు పొంగి పొర్లడం, చెట్లు విరిగిపడటంతో.. పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకులకు సైతం తాము సూచించే వరకు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. కేరళతోపాటు గోవాలో పూర్తిగా విస్తరించాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రుతుపవనాలు ఆంద్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Also Read: Terrorist Organizations: ఉగ్ర కుట్రల వెనక ఆ రెండు సంస్థలు.. సంచలన విషయాలు వెలుగులోకి!

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..