Indira Mahila Sakthi ( IMAGE credit: swetcha reporter)
రంగారెడ్డి

Indira Mahila Sakthi: కల్వకుర్తిలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు..

Indira Mahila Sakthi: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని నాగర్‌కర్నూల్,  (Kalwakurthi) కల్వకుర్తిలలో వేర్వేరుగా జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. కల్వకుర్తిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,(Kasireddy Narayana Reddy) కలెక్టర్ బాదావత్ సంతోష్ (Badawat Santosh) పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించారు.

 Also Read:Gold Rate Today: అయ్య బాబోయ్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ ఎంతంటే?

రూ.5.47 కోట్ల చెక్కు

కల్వకుర్తి (Kalwakurthi) నియోజకవర్గ పరిధిలోని 57 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.5.47 కోట్ల చెక్కును అందజేశారు. అలాగే, 1387 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రూ.1.57 కోట్ల చెక్కును, 14 మంది సభ్యులకు సంబంధించిన రూ.6.88 లక్షల లోన్ బీమా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతన రేషన్ కార్డులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 Also Read: Illegal Constructions: పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు

Just In

01

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?