Gold Rate Today: దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా పసిడే అందరికీ గుర్తుకు వస్తుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడి ఒక తిరుగులేని వస్తువుగా స్థానం సంపాదించింది. పసిడిని ధరించడం ద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని చాలా మంది నమ్మకం. పెట్టుబడి మార్గానికి సైతం బెస్ట్ ఛాయిస్ కావడంతో పసిడికి డిమాండ్ ఎప్పటికీ ఉంటూనే వస్తోంది. ఇదిలా ఉంటే గత మూడ్రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. వరుసగా నాల్గో రోజూ కూడా పెరిగాయి. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం.
ఎంత పెరిగిందంటే?
దేశంలో పసిడి ధరలు సోమవారం (21 జులై, 2025) మరోమారు పెరిగాయి. అయితే ఇవాళ కాస్త స్వల్పంగా పెరగడం గమనార్హం. ఆదివారంతో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.100 పెరిగిపోయింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి.. రూ.110 పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్.. రూ. 91,800 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ను రూ. 1,00,150 విక్రయిస్తున్నారు. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి వ్యత్యాసం చోటుచేసుకోలేదు. దేశంలో కిలో వెండి రూ.1,26,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
❄️ హైదరాబాద్: రూ.1,00,150
❄️ విజయవాడ: రూ.1,00,150
❄️ విశాఖపట్టణం: రూ.1,00,150
❄️ వరంగల్: రూ.1,00,150
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
❄️ హైదరాబాద్: రూ.91,800
❄️ విజయవాడ: రూ.91,800
❄️ విశాఖపట్టణం: రూ.91,800
❄️ వరంగల్: రూ.91,800
వెండి (1 కిలో)
❄️ హైదరాబాద్: రూ.1,26,000
❄️ విజయవాడ: రూ.1,26,000
❄️ విశాఖపట్టణం: రూ.1,26,000
❄️ వరంగల్: రూ.1,26,000