Germany Accident: జర్మనీలో విచిత్రమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బోమ్టే పట్టణంలో ప్రమాదానికి గురైన కారు.. ఏకంగా గిడ్డంగి (Barn) పైకప్పులోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలా ఎలా యాక్సిడెంట్ చేశావ్ బ్రో అంటూ నెట్టింట కింద కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
జర్మనీలోని బోమ్టే పట్టణంలో ఈ అనూహ్యమైన యాక్సిడెంట్ జరిగింది. తొలుత ఓ పార్క్ చేసిన కారును ఢీ కొట్టిన వాహనం.. ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డుపక్కనే ఉన్న గిడ్డంగి ప్రహారిని ఢీకొట్టి.. గార్డెన్ లోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడ ఆడుకుంటున్న ఓ బాలుడ్ని సైతం కారు ఢీకొట్టినట్లు సమాచారం. అనంతరం నేలపై ఎత్తుగా ఉన్న ప్రాంతంపైకి వేగంగా వెళ్లడంతో మరోమారు అదుపుతప్పి గిడ్డంగి రోఫ్ పైకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో భూమి నుంచి 10 అడుగుల ఎత్తులో (3 మీటర్లు) ఉన్న రూఫ్ పై కారు ప్రమాదకరంగా నిలిచిపోయింది.
పలువురికి గాయాలు..
ఈ ప్రమాదంలో తొలుత ఢీకొట్టిన బాలుడికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ ను 42 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నిందితుడితో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులు (11-12 ఏళ్ల వయసు వారు) ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 13 ఏళ్ల మరో బాలుడు సైతం కారులోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు వివరించారు.
Also Read: CM Revanth Reddy: ఘనంగా బోనాల ఉత్సవాలు.. అధికారులపై సీఎం ప్రశంసలు
హెలికాఫ్టర్ల మోహరింపు
అయితే ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటీనా ఘటనా స్థలికి చేరుకున్నట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పదికి పైగా ఫైరింజన్లు, బాధితుల తరలింపు కోసం రెండు రెస్క్యూ హెలికాఫ్టర్లను సైతం మోహరింప చేసినట్లు చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లు పేర్కొన్నారు. కాగా క్రేన్ సహాయంతో కారును కిందకి దించి.. దానిని అధికారులు దూరంగా తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A car dramatically crashed into a barn roof in Bohmte, Germany, on Saturday, injuring several people, including a seriously hurt seven-year-old boy.#Germany #Bohmte #CarCrash #Firefighter #Alert #Rescue #Helicopters #NorthwesternGermany #LatestNews pic.twitter.com/bFhOd7TGnc
— Europe Cognizant (@EuropeCognizant) July 20, 2025