Jess
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: 9 నెలల్లో మృత్యువు.. విలువైన సలహాలు కోరిన యువతి

Viral News: బతికేది మరికొన్ని రోజులేనని తెలిస్తే, చిన్నవారైనా, పెద్ద వయస్కుకులకైనా, ధనవంతుడైనా, పేదవాడైనా చెప్పలేని దుఃఖంలో మునిగిపోతాడు. దిగ్భ్రాంతికి గురయ్యి.. ఆ తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోయి, నిరాశ, నిస్పృహలోకి జారుకుంటారు. అయినవాళ్లు, ఆత్మీయులను చూసి, తలచుకొని విలపిస్తుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన జాస్ అనే యువతికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 25 ఏళ్ల వయసున్న ఆమె తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి తీవ్ర ఏ స్థాయిలో ఉందంటే ఆమె కేవలం మరో 9 నెలలేనని వైద్యులు నిర్ధారించారు.

అయితే, జాస్ తన చివరి రోజులను ఆనందంగా, ఉల్లాసంగా గడపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తాను దాచుకున్న 24,000 డాలర్లను ( మన కరెన్సీలో దాదాపు రూ.20 లక్షలు) ఎలా ఉపయోగించుకోవాలి? అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడిట్‌’లో ((Viral News)  ఒక పోస్టు పెట్టింది. నిజానికి ఈ డబ్బుతో యూనివర్సిటీలో ఉన్నత చదువు చదువుకోవాలనుకున్నానని, కానీ, ఇప్పుడు జీవితం తలకిందులు కావడంతో, చివరి రోజులను ఆస్వాదించడానికి ఈ డబ్బును అవకాశంగా వాడుకుంటానని జాస్ చెప్పింది. ‘‘నా దగ్గర 24,000 డాలర్లు ఉన్నాయి. ఈ డబ్బును నా తోబుట్టువులకు ఇచ్చేయాలని తొలుత అనుకున్నాను. కానీ, నిజం చెప్పాలంటే నేను నా జీవితంలో అసలు ఎంజాయ్ చేయలేదు. బయటకి వెళ్లిందే లేదు. కనీసం డ్రింక్స్ లాంటివి కూడా తాగలేదు. మంచి డ్రెస్సులు కొనుక్కోలేదు. సిగరెట్లు ముట్టలేదు. అందుకే, మొత్తం కాకపోయినా ఆత్మసంతృప్తి మిగిలేలా ఈ డబ్బులో ఎంతోకొంత ఖర్చు పెట్టి వెళ్లిపోవాలనుకుంటున్నాను. ఇది మరీ అంత ఎక్కువ డబ్బు కాకపోవచ్చు. కానీ, ఖరీదైన సలహాలు ఇవ్వండి’’ అని జాస్ కోరింది.

Read Also- Serial kisser: నా మూవీస్‌లో ముద్దులు అందుకే.. ఇమ్రాన్ హష్మి క్లారిటీ

ఈ పోస్టు ‘రెడిట్’ యూజర్లు చాలా మందిని భావోద్వేగానికి గురిచేసింది. చాలా బాధాకరమంటూ విచారం వ్యక్తం చేశారు. జాస్‌కు సంతృప్తి కలిగించేలా చాలామంది సలహాలు ఇచ్చారు. ఎందుకైనా మంచిది ఈ వ్యాధిపై మరో వైద్యుడిని సంప్రదించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని సూచించారు. మరికొందరు స్పందిస్తూ, చివరి రోజులు ఎలా గడపాలి, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనేదానిపై సలహాలు, సూచనలు చేశారు. బాగా ఇష్టమైన ప్రదేశాలను మళ్లీ చూడాలని, మనసులో ఉన్న కోరికలను తీర్చుకోవాలని సూచించారు. బాగా ఇష్టమైన పనులు మొదలుపెట్టాలని, స్కైడైవింగ్, మ్యూజిక్ కాన్సర్ట్స్, ఖరీదైన దుస్తులు, షూస్ ధరించాలని సూచించారు. ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని, స్పాలు, మేకోవర్ చేయించుకోవాలని మరికొందరు సలహా ఇచ్చారు.

మంచి భోజనం చేయండి
మీరు ఉన్న స్థితిలో తాను ఉంటే, ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం చేస్తానని, లైవ్ థియేటర్, లైవ్ మ్యూజిక్‌కు వెళ్తానంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. బ్రాండ్ పైజామాలు, మెత్తటి బెడ్ షీట్‌లు కొనేస్తానని, స్టైలిష్ హెయిర్‌కట్ చేయించుకుంటానంటూ పేర్కొన్నాడు. తనకు ఉపయోగపడే ఆభరణాలు కూడా కొనుక్కుంటానని, కొంత డబ్బును తన తోబుట్టువుల కోసం ఉంచుతానని పేర్కొన్నాడు. కానీ, మీరు ఈ పరిస్థితిలో ఉన్నందుకు చాలా బాధగా అనిపిస్తోందని, మిగిలివున్న ఈ తక్కువ కాలంలో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్టు ఓ యూజర్ పేర్కొన్నాడు.

Read Also- Hardik Pandya: హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం?

అదే తానైతే వెంటనే థాయ్‌లాండ్ లేదా వియత్నాం లేక ఫిలిప్పైన్స్‌కి వెళ్లిపోతానని, అక్కడైతే ఈ డబ్బుతో చాలా ఎక్కువ కాలం జీవించవచ్చని ఓ యూజర్ సూచించాడు. బీచ్ దగ్గరగా ఉండే ఒక చిన్న టౌన్‌లో సెటిల్ అవ్వాలని, ప్రతిరోజూ మసాజ్ చేయించుకొని, చక్కటి భోజనం చేస్తూ జీవించాలని ఓ యూజర్ సూచించాడు. తానైతే ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి బాగా పార్టీలు ఏర్పాటు చేసి కాలక్షేపం చేస్తానని చెప్పాడు. పార్టీలు నిర్వహిస్తే అందరూ వస్తారని, ఆ ప్రేమను చివరి వరకూ ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నాడు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు