Serial kisser: బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మికి ‘సీరియల్ కిస్సర్’ అనే ట్యాగ్ ఉంది. సినిమాల్లో ముద్దు సీన్లకు అతడొక పర్యాయ పదంగా మారిపోయాడు. మర్డర్, జహర్, జన్నత్, గ్యాంగ్‌స్టర్, అక్సర్, రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్ వంటి మూవీస్‌లో ఉన్న కిస్సింగ్ సీన్లను చూస్తే ఈ ట్యాగ్ ఎందుకు వచ్చిందో ఎవరికైనా అర్థమైపోతుంది. ఈ విధంగా తన సినిమాల్లో ముద్దు సీన్లు, ‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మి వివరణ ఇచ్చాడు. తన పేరు పక్కన ‘సీరియల్ కిస్సర్’ అనే ట్యాగ్ తప్పనిసరిగా కనిపిస్తుండడాన్ని చూస్తున్నానని, అయితే, దీనిని ఆపాలంటూ పోరాడనక్కర్లేదనే అభిప్రాయానికి తాను వచ్చినట్టు ఇమ్రాన్ చెప్పాడు.
ప్రతి నటుడిపై కొన్ని ప్రత్యేక అంచనాలు ఉంటాయని, వాటికి కట్టుబడి ఉంటాలని తాను నమ్ముతున్నట్టు ఇమ్రాన్ హష్మి చెప్పాడు. అలాంటి స్టార్ల నుంచి ఆడియెన్స్ ప్రత్యేకంగా ఏదోఒకటి ఆశిస్తుంటారని, తన విషయంలో ఆ అంచనా ‘ముద్దు’ సన్నివేశమని పేర్కొన్నాడు. కాబట్టి ముద్దు సీన్ తప్పదని, నిజం చెప్పాలంటే ఇది మంచి విషయమేనని వ్యాఖ్యానించాడు. ప్రతి నటుడికీ కొంత ప్రత్యేకత ఉంటుందని, ఒక రకంగా ఆ హీరోకి గుర్తింపుగా మారిపోతుందని వివరించాడు. ప్రేక్షకులను సంతోషపెట్టాలంటే ఆ సీన్ చేయాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. తన సినిమాల్లో ముద్దు సీన్ లేకపోతే ఆడియెన్స్‌కు అసహనం కలుగుతుందని అన్నాడు. స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ షర్ట్ విప్పేకపోతే, మోసపోయినట్టుగా అభిమానులు ఎలా భావిస్తారో, ఇది కూడా అలాంటిదేనని ఇమ్రాన్ హష్మి సరదా వ్యాఖ్య చేశాడు.
Read Also- Hardik Pandya: హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం?
ఈ సందర్భంగా తాను నటించిన ‘తుమ్ మిలే’ సినిమాలో ఓ సన్నివేశాన్ని ఇమ్రాన్ హష్మి సరదాగా గుర్తుచేశాడు. ‘‘ నేను తుమ్ మిలే సినిమా చూస్తున్నాను. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో సోహా అలీ ఖాన్ (నటి) తో నేను ఒంటరిగా ఉంటాను. సాధారణంగా నా సినిమాల్లో ఇలా హీరో, హీరోయిన్ ఒంటరిగా ఉంటే సీన్లలో కిస్‌లు ఉంటాయి. కానీ, ఆ సన్నివేశంలో ముద్దు ఉండదు. నా పక్కనే కూర్చొని సినిమా చూస్తున్న వ్యక్తి స్పందిస్తూ ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మికి ఏమైనా జ్వరం వచ్చిందా? అని అనేశాడు. ఆ వ్యక్తి సరదాగే అన్నాడు. కానీ, ‘సీరియల్ కిస్సర్’ అనే ట్యాగ్ అభిమానుల హృదయాల్లో ఎంత బలంగా పాతుకుపోయిందో తెలియజేస్తోంది’’ అని వివరించారు. సినిమాల్లో చొక్కా విప్పడం కంటే కిస్ సీన్లే ఎక్కువ ఫన్ ఇస్తాయంటూ చమత్కరించారు.
Read also- Viral News: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ విండో తెరవబోయిన ప్యాసింజర్
కిస్సింగ్ సీన్లపై తన కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో కూడా ఇమ్రాన్ హిష్మి వివరించాడు. ‘‘ఇంట్లో వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. మా కడుపు నింపేది నా నటనేనని వాళ్లకు తెలుసు. ప్రతిసారీ స్క్రీన్ మీద రొమాంటిక్ సన్నివేశాలు చూడటం నా భార్య, మా నాన్నకు నచ్చదు. కానీ, కెరీర్ కోసం చాలా కాలంగా నేను ఎంపిక చేసుకున్న ఆప్షన్‌ను వాళ్లు అంగీకరించాల్సి వస్తోంది” అని వివరించాడు. కాగా, ఇమ్రాన్ హష్మి చివరిగా “గ్రౌండ్ జీరో” సినిమాలో కనిపించాడు.