Health Benefits: పియర్స్ పండు (నాసిపత్తి) గురించి మనలో కొందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, దీనిలో మనకి కావల్సిన పోషకాలు ఉంటాయి. ఈ పండు మార్కెట్లలో సులభంగా దొరుకుతోంది. ఈ పండులో ఫోలేట్ విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చూడటానికి ఆపిల్‌లా కనిపించే ఈ పండు, పోషకాల పరంగా ఆపిల్‌ను మించి ఉంటుంది.
అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను సులభతరం చేస్తూ, ప్రేగు క్రమబద్ధతను కూడా నిర్వహిస్తుంది. ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి, వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తాయి. అంతేకాదు, పియర్స్‌లో క్యాన్సర్ నిరోధక సమ్మేళనాలు కూడా ఉన్నాయి. మన శరీరాన్ని కూడా వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
Also Read: Fish Venkat: దిల్ రాజు, సోను సూద్ సాయం చేస్తామని చెప్పి.. ఫోన్ కూడా ఎత్తలేదు.. ఫిష్ వెంకట్ కుమార్తె
రోజూ ఒక పియర్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. షుగర్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అధిక నీటి శాతంతో, ఫైబర్‌తో నిండిన ఈ పండు బరువు తగ్గాలనుకునేవారికి కూడా మంచిగా ఎంపిక. వాళ్ళు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా డైట్ లో చేర్చుకోవచ్చు.
Also Read: Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!
ఇంకా, ఈ పియర్స్ పండ్లు తినడం వలన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు, శరీరంలో హానికర బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అద్భుత పండును రోజూ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.