Indian Raiways: భారతీయ రైలు సామాన్యుడి నేల విమానం. నిత్యం వేల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే ఈ వ్యవస్థ నుంచి ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం లభిస్తుంటుంది. టికెట్ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రజలు రైల్వే ప్రయాణానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. పండుగల సమయంలో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. కనీసం నిలబడడానికి కూడా చోటు లేకుండా జనం ఎక్కేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం రైల్వే ప్రయాణాల్లో విచిత్ర పనులు చేసి వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాకయి, ట్రోల్ చేస్తున్నారు.
లగేజ్ దగ్గర..
రైలులో రద్దీ అధికంగా ఉండడంతో ఓ ప్రయాణికుడు లగేజ్ ఉంచే ర్యాక్‌పైకి ఎక్కాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నది. నెటిజన్లను ఈ చిత్రం ఆకట్టుకున్నది. పైగా, బ్యాగ్ తల కింద పెట్టుకుని ఫోన్ చేస్తూ ఫోజులిచ్చిన అతన్ని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కూర్చోడానికి ఖాళీ లేకపోతే ఇలా చేస్తారా?, మిగిలిన వాళ్లు లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇలా అనేక కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
రెండుగా విడిపోయిన నెటిజన్స్
ప్రయాణికుడి ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు రకాలుగా విడిపోయి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు అతనికి మద్దతుగా నిలబడితే, మిగిలినవాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇది భారతీయ రైల్వేలో అత్యున్నత ఆవిష్కరణ’’ అంటూ ఓ నెటిజన్ చమత్కరిస్తూ కామెంట్ చేశాడు. ‘‘ఇతన్ని జైలులో వేసినా తప్పులేదు’’ అని ఇంకొకరు పోస్ట్ చేయగా, ‘‘అసలు ఎవరూ గమనించకుండా అతను అక్కడికి ఎలా వెళ్లాడు’’ అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది దీనిని ఎలా అనుమతించారని అడిగాడు. ‘‘టీటీఈ గారూ.. ఇది చూడండి, మీరూ ఆశ్చర్యపోతారు’’ అంటూ ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. మరో నెటిజన్ అయితే, ‘‘బ్రో తనను తాను ఉన్నత తరగతికి అప్‌గ్రేడ్ చేసుకున్నాడు’’ అని చమత్కరించాడు. ‘‘ఇతని నిబద్ధతకు అవార్డ్ ఇవ్వాల్సిందే’’ అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘ఇది చూడడానికి ఫన్నీగా ఉండొచ్చు. కానీ, సురక్షితం కాదు. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడమే. లగేజ్ ర్యాక్ మనిషి బరువును మోయడానికి ఏర్పాటు చేసింది కాదు. దాని కింద ఉన్న వారిని ప్రమాదంలో ఉంచినట్టే’’ అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also- Fish Venkat: దిల్ రాజు, సోను సూద్ సాయం చేస్తామని చెప్పి.. ఫోన్ కూడా ఎత్తలేదు.. ఫిష్ వెంకట్ కుమార్తె