Mynampally Hanumantha Rao (imagecredit:swetcha)
Politics

Mynampally Hanumantha Rao: జీవితంలో కేటీఆర్ సీఎం అయ్యేది కలే.. మైనంపల్లి

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం తాను ఎక్కడి వరకైనా ఫైట్ చేస్తానని, అవసరమైతే మాజీ మంత్రులు హరీష్​ రావు(Harish Rao), కేటీఆర్(KTR) ఇళ్లపై దాడులు చేస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. ఆయన గాంధీభవన్(Gandhi Bavan) లో మాట్లాడుతూ కేటీఆర్(KTR) ఓ హౌలా అంటూ పరుష పదజాలంతో విమర్శించారు. జీవితంలో కేటీఆర్ సీఎం కాడని వెల్లడించారు. రెడ్ బుక్(Red Book) తో కేటీఆర్ ఏం చేస్తాడో? ధైర్యంగా చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యం లేని నేతలు తమపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.

నరం లేని నాలుక మాదిరి
అమెరికాలో బాసాన్లు కడిగేందుకు త్వరలోనే పంపిస్తామంటూ చురకలు అంటించారు. గత ప్రభుత్వంలో కేటీఆర్(KTR) షాడో సీఎంగా వ్యవహరిస్తూ, అన్నీ తప్పిదాలే చేశారన్నారు. నరం లేని నాలుక మాదిరి కేటీఆర్(KTR) అహంపూరిత మాటలు కనిపిస్తున్నాయన్నారు. ఇంటింటికి ఉద్యోగం, దళిత సీఎం, దళితులకు భూములు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇలాంటివన్నీ మోసపూరిత హమీలు ఇస్తూ ప్రజలను మోసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone Taping)తో సినీ, ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లో చిచ్చు పెట్టారన్నారు.

Also Read: Kavitha on BRS: మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదు.. కవిత

ఫోన్ ట్యాపింగ్‌లో గన్ మెన్లు
ప్రవళిక ఆత్మహత్యకు లవ్ ఎఫైర్ అంటూ అంటకట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌(Phone Taping)లో గన్ మెన్లు, హీరోయిన్లను కూడా చేశారన్నారు. ఓ హీరోయిన్‌కు ఫామ్ హౌస్ రాసిస్తానని చెప్పినట్లు ఆమె గతంలోనే బహిరంగంగా చెప్పారని మైనంపల్లి వివరించారు. కాంగ్రెస్(Congress) హయంలో లా అండ్ ఆర్డర్(Law and Order) బ్రహ్మండంగా ఉన్నదననారు. కేటీఆర్‌(KTR)కు మంచి గాచెప్తే అర్థం కావడం లేదని, తన స్టైలో లోనే సినిమా చూపిస్తానని మైనంపల్లి హెచ్చరించారు.

Also Read: Nimisha Priya: నిమిషా మరణశిక్షపై మరోసారి స్పందించిన కేంద్రం

 

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?