Kavitha on BRS (imagecredit;twitter)
Politics

Kavitha on BRS: మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదు.. కవిత

Kavitha on BRS: బీఆర్ఎస్ నేతలు మెల్లగా తన దారికి రావాల్సిందేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతేనన్నారు. ‘‘బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు. అది తప్పు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే’’ అని వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసిందని, అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులు పాస్ చేశారన్నారు.

కామెంట్స్‌కు పార్టీ రియాక్ట్ కాలేదు
బీఆర్ఎస్(BRS) నేతలు ఈ రెండు వేర్వేరు అనే విషయాన్ని చెప్పకుండా ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణపై రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానం (ఆర్డినెన్స్) ను సమర్థిస్తున్నట్లు వెల్లడించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సపోర్ట్ చేశానని స్పష్టం చేశారు. తనపై తీన్మార్ మల్లన్న(Teen Mar Mallana) చేసిన కామెంట్స్‌కు పార్టీ రియాక్ట్ కాలేదని, దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేసానని, ఆయన ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందని పేర్కొన్నారు.

Also Read: Viral Video: రేయ్ ఎవర్రా మీరంతా.. తప్పతాగి పోలీసులతో ఆటలెంట్రా!

కమీషన్ల కోసమే ప్రాజెక్టు
బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)తో ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తెలంగాణ(Telangana)లోని తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం చేపడితే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఇచ్చే కమీషన్ల కోసమే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మండిపడ్డారు. బనకచర్లను ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బనకచర్లతో పాటు బీసీ(BC) రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఇక, టీబీజీకేఎస్(TBGKS) బాధ్యతల నుంచి తనను తప్పించి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించడంపై స్పందిచిన కవిత, ఆయన స్వయంగా బొగ్గుగని కార్మికుడని, తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

Also Read: Ramchander Rao: టీబీజేపీలో చక్రం తిప్పేదెవరు.. తెర వెనుక కీలక నేతలు

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!