AI Videos
Viral

Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!

Viral Videos: కృత్రిమ మేధస్సు (AI) తో వీడియోలు, ఫోటోలను సృష్టించడం ఇప్పుడు అందరికీ మామూలైపోయింది. ఎందుకంటే ఏఐ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా మారిపోయింది. ముఖ్యంగా.. దీని ద్వారా ఫోటోలను సృష్టించడానికి లేదా ఇప్పటికే ఉన్న ఫోటోలను మెరుగుపరచడానికి చాలానే మార్గాలు ఉన్నాయి. టెక్స్ట్ నుంచి ఇమేజ్, ఫోటో ఎడిటింగ్, మీ ఫోటోల్లో అనవసరమైనవి తొలగించడం, జతచేయడం.. లైటింగ్, రంగులను ఆటోమేటిక్‌గా సరిచేయగలవు. అంతేకాదు.. పాత ఫోటోలను పునరుద్ధరించగలవు. ముఖాన్ని లేదా శరీరాన్ని కూడా అందంగా సెట్ చేయడంలో ఏఐ సహాయపడుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే మీ ఫోటోలను ప్రముఖ కళాకారుల చిత్రాల శైలిలో కూడా మార్చి ఇస్తుంది. ఇక ఒకరి ముఖాన్ని మరొకరి శరీరానికి లేదా వీడియోలో మార్చడానికి కూడా ఏఐ ఉపయోగపడుతుంది. అయితే, దీనిని జాగ్రత్తగా, నైతికంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఇక వీడియోల విషయానికొస్తే.. వీడియోలోని అనవసరమైన భాగాలను తొలగించి, హైలైట్‌లను సృష్టించగలదు. వీడియోలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేదా వాయిస్‌ని క్లియర్‌గా సెట్ చేస్తుంది. తక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియోలను 4K లేదా 8K నాణ్యతకు కూడా పెంచడం ఏఐతోనే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి మాటలను మరో భాషలో మాట్లాడేలా లిప్ సింక్ చేయడం లేదా వారి వాయిస్‌ని కాపీ చేసి కొత్త మాటలు పలికించడం చేస్తుంది. ఎవరైనా వ్యక్తి ముఖాన్ని లేదా వాయిస్‌ని మరొక వీడియోలో సృష్టించడం కూడా ఏఐ చేసేస్తుంది. ఇప్పుడు ఏఐతో ఫొటోలు, వీడియోలే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూసే వీడియోలు ఏఐ క్రియేటివిటీనే.. కానీ, అచ్చుగుద్దినట్లుగా ఆయా జంతువులు, మనుషులు మాట్లాడినట్లుగానే ఉన్నాయి.

Read Also-Mayasabha: ‘మయసభ’ వెబ్ సిరీస్‌పై ట్విటర్ లో రచ్చ.. స్పందించిన దర్శకుడు

ఓ లుక్కేయండి..
ఏఐ వచ్చిన తర్వాత వీడియోలు ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. న్యూటన్ గ్రావిటీ (గురుత్వాకర్షణ)ను ఎలా కనిపెట్టారు? అనే విషయాన్ని ఏఐ ద్వారా చేసిన ఒక వీడియోను చూస్తే వామ్మో.. అస్సలు నవ్వు ఆపుకోలేరు అంతే. న్యూటన్ ఒక చెట్టు కింద పడుకొని ఉంటాడు. అప్పుడే చెట్టుపై నుంచి ఆపిల్ కింద పడుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి అటుగా వచ్చి దోశ, చికెన్ గ్రేవీ, టీ అని చెబుతాడు. వావ్.. గ్రేవీ, టీ రెండూ కలిపితే గ్రావిటీ అని న్యూటన్ చెబుతారు. చూడండి ఎంత కామెడీగా ఉందో వీడియో. దీనికి ఇక మీమ్స్ జతచేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఈ వీడియో కామెంట్స్ చూశారంటే బాబోయ్.. న్యూటన్‌ను ఈ రేంజిలో ఆడుకుంటున్నారేంట్రా అని దుమ్ముదులిపేస్తున్నారు. ఇక జిఫ్ బొమ్మలైతే తెలుగు కమెడియన్స్ అందరూ ఇక్కడే కనిపిచ్చేస్తారంతే.


ఐరన్ చేయొస్తుందా రాదా?
మరో వీడియో చూస్తే.. ఒక పర్సన్ ఇస్త్రీ చేస్తుంటాడు. అయితే తెలుపు రంగు షర్టును ఐరన్ చేస్తూ కాల్చేస్తాడు. ఇప్పుడిక షర్టు ఓనర్ వచ్చి అరేయ్.. నీకు ఐరన్ చేయొస్తుందా? లేదా? నువ్వు ఎలా ఐరన్ మ్యాన్ అయ్యావురా? అంటూ మండిపడతాడు. వాస్తవానికి అక్కడ ఐరన్ చేసే వ్యక్తి ఐరన్ మ్యాన్ అన్న మాట. అంటే ఐరన్ చేసే మనిషి నుంచి ‘ఐరన్ మ్యాన్’ తయారయ్యాడని ఈ వీడియోలో చూపించినట్లుగా ఉన్నది. అంతేకాదు.. ఆ ఐరన్ మనిషి అచ్చుగుద్దినట్లుగా ఐరన్‌తో కూడిన డ్రెస్ ఉండటంతో నవ్వులు ఆగట్లేదు. మరో వీడియోలో.. చింపాంజీ మ్యాన్షన్ హౌజ్ మందు తాగుతున్నట్లుగా ఉంది. ఫుల్లుగా తాగిన తర్వాత ‘ దీనెవ్వా.. ఏంది మామా ఇది.. పట్ట పగలు చుక్కలు చూపిస్తోంది. జై బాలయ్య’ అంటూ బురదలో దూకుతుంది. మాటలు రాని జంతువుతో కూడా ఏఐ మాట్లాడిస్తోందంటే చూశారా అదీ దాని పవర్. ఇలా ఒకటా రెండా మరెన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Read Also- Fish Venkat: ముంగిలంపల్లి వెంకట్ నుంచి ‘ఫిష్’ వెంకట్‌‌గా ఎలా మారాడు?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?