Mayasabha: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ ‘మయసభ’. ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో దేవా కట్ట ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. సోనీలివ్ ఒరిజినల్‌లో ఆగస్టు 7వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్ తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఓపెన్‌గా బయోపిక్ అని ప్రకటించిన కథలన్నీ కల్పితాలేనని ఇప్పటికే దర్శకుడు దేవా కట్టా అన్నారు. కాగా విడుదలైన టీజర్ సంచలనం రేపుతోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులైన రాజకీయ నాయకులు ప్రత్యర్థులుగా ఎలా మారారు అనే ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై దర్శకుడు దేవ కట్టా స్పందించారు.
Read also- Heroine: ప్రియుడితో అలాంటి డర్టీ ఫోటో లీక్.. 14 ఏళ్ళు నరకం చూసిన హీరోయిన్?
‘గంట గంటకీ టీజర్ మీద పెరుగుతున్న మీ ఆసక్తికి, అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో నుంచి వస్తున్న ట్రెండింగ్ రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు! ఇది మాత్రం గ్యారెంటీ: ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ నాయకుని భక్తులైనా.. నాయకులకతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక ఉన్నతమైన మానవీయ అనుభూతినిస్తుంది.’ అని ‘మయసభ’ గురించి రాసుకొచ్చారు దర్శకుడు. దానికి ఓ యూజర్ ఇలా కామెంట్ పెట్టారు. ‘దర్శకుడు దేవ కట్టా గారు ఎంత ‘ఇది క్రియేటివ్!’ అన్నా, ప్రజలు మాత్రం ‘మీ క్రియేటివిటీ వెనక రియాలిటీ గోస ఉంది’ అంటూ డికోడ్ చేసి తీరారు. ఇప్పుడు…దేవా కట్టా గారు “ట్విట్టర్ సభ” తీర్పుని ఎలా సమర్ధించుకుంటారో? అని రాసుకొచ్చారు. అంటే దేవా కట్టా తీసేది మొత్తం ఇద్దరు తెలుగు రాజకీయ నాయకులు గురించి అని స్పష్టంగా తెలుస్తుంది. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు. అని అడిగారు.
Read also- Indiramma Housing scheme: ఆర్థిక బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి పొంగులేటి
దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘ఓపెన్ గా బయోపిక్ అని ప్రకటించిన కథలు కూడా కల్పితాలే. డబ్భై ఎనభై ఏళ్ల ఒక వ్యక్తి జీవితాన్ని ఎవరైనా మూడు గంటల్లో కల్పితం లేకుండా చెప్పగలరా?. ఉన్నతమైన మానవీయ భావాల్ని పెంచడానికి రాసే కథలు అంతకన్నా కల్పితం. ప్రతి రాజకీయ ప్రక్రియకీ ఇదే ధ్యేయం. శత్రుత్వాన్ని పెంచడం కాదు. ఈ పాత్ర పేరు కృష్ణమ నాయుడు . పేదరికం, నత్తి లాంటి బలహీనతల్ని అధిగమించి నాయకుడిగా ఎదిగిన పాత్ర.’ అని సమాధానం ఇచ్చారు. కాగా ఇదే విషయంపై మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఇప్పటికే చాలా సినిమాల్లో చంద్ర బాబు నాయుడిని విలన్ గా చూపించారు. ఇంకా ఎన్ని సినిమాల్లో చూడాల్సి వస్తుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.