Indiramma Housing scheme (imagecredit:swetcha)
తెలంగాణ

Indiramma Housing scheme: ఆర్థిక బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి పొంగులేటి

Indiramma Housing scheme: తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను ఆర్థికంగా బలవపత్రం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Pongileti Srinivas Reddy) పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల జారి కార్యక్రమంలో మంత్రి పొంగిలేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా నాకు ఇల్లు వచ్చింది. అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల మొహంలో ఆనందం కనబడడం చాలా సంతృప్తినిస్తుందని అన్నారు. ఇండ్లు రానీ ఆడబిడ్డలు కూడా నిరుద్యోగ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేదని అన్నారు. ప్రజా దీవెనతోటే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మోసం చేసే ప్రభుత్వం కాదు. దొరల ప్రభుత్వం కాదు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు
ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పేదోడికి న్యాయం చేయడమే కాంగ్రెస్(Congress) ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) లక్షలాదిమంది ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తానని చెబితే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. మాటలు చెప్పే ప్రభుత్వం కాదనీ, మహిళా సంఘాల్లో ఉన్న ఆడబిడ్డలను అన్ని విధాల ఆర్థికంగా ఆదుకోవడమే ప్రధాన ధ్యేయమన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు(RTC Bus), పెట్రోల్ బంకులు పెట్టించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం దోహదపడుతుందని చెప్పారు. అప్పుడు 18 నుంచి 60 సంవత్సరాలు, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉన్న వారందరికీ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చే అవకాశం కల్పించామన్నారు. బ్యాంకు లింకేజీ, ఐకెపి కొనుగోలు కేంద్రాలు, పాఠశాలల మరమ్మత్తులకు సంబంధించిన పనులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పథకాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమాలు సైతం మహిళా సంఘాలకు అప్పగించి వారి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

Also Read: GHMC: బర్త్ డెత్ సర్టిఫికెట్ల గైడ్‌లైన్స్ కఠినతరం

పాత రేషన్ కార్డుల్లో 16 లక్షల పైచిలుకు
అవకాశం ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాట మీద నిలబడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మహిళలందరికీ ఆర్థిక స్వేచ్ఛతో పాటు రక్షణ కల్పించడమే ఈ ప్రభుత్వం ఆలోచనని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులను అందరికీ అందజేసే కార్యక్రమాన్ని వచ్చేనెల 14వ తేదీ నుంచి మొదలుపెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేయడమే ప్రభుత్వం దేహంగా పెట్టుకుందన్నారు. అంతేకాకుండా పాత రేషన్ కార్డుల్లో 16 లక్షల పైచిలుకు పేర్లను ఎక్కించిన ఘనత కాంగ్రెస్(Congress) ప్రభుత్వంది అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే పేదోడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇండ్లన్నారు. ఈ కార్యక్రమంలో దఫ దఫాలుగా అర్హులైన అందరికీ ఇవ్వడమే ప్రభుత్వం చేసే గొప్ప పని అన్నారు. గత ప్రభుత్వ నాయకులు సొల్లు పురాణం అజ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో కేవలం 60000 ఇండ్లు మాత్రమే నిర్మించారనీ చెప్పారు.

అత్యంత ఆదరణతో దీవించారు
పేదోడి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలోనే నాలుగు లక్షల 50 వేల ఇండ్లను నిరుపేదలకు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే పేదవాడికి అండగా నిలబడి ఆదరిస్తుందని ప్రజలు గెలిపించాలని గుర్తు చేశారు. పేదవాళ్లు అత్యంత ఆదరణతో దీవించారు కాబట్టే ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నామని అన్నారు. ప్రభుత్వం మీది ఎమ్మెల్యే(MLA) మీ వాడే ఎంపీ(MP) మీ వాడే, మంత్రి(MIN) మీవాడు, ముఖ్యమంత్రి మీ వాడే, కింద నుంచి పైదాకా ప్రభుత్వం మీది కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నిక(local body elections)ల్లో ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని సూచించారు. ప్రజలకు ఎప్పటికీ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పినపాక మండలంలో లోతట్టు ప్రాంతాలలో నివసించే నిరుపేదలకు స్వయంగా ప్రభుత్వమే స్థలానికి కేటాయించి ఇందిరమ్మ ఇళ్లను సైతం ఇస్తుందని, ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని సైతం తీసుకొచేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

Also Read: Loans to Women: మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.344 కోట్ల రుణాలు

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?