Viral News: శారీరక సంబంధాలు దారుణమైన నేరాలకు (Viral News) దారితీస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఒకరిపై మరొకరికి నమ్మకం, బాధ్యతలతో సాగాల్సిన కుటుంబ బంధాలను విస్మరించి కొనసాగిస్తున్న అక్రమ సంబంధాలు పచ్చని కాపురాలను కబలించివేస్తున్నాయి. సామాజిక, నైతిక విలువలు మంటగలిపేలా వెలుగుచూస్తున్న ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరిదితో (బంధువు) శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా చేసి కరెంట్ షాక్ తగిలిందంటూ అందరినీ నమ్మించింది. మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఈ అబద్ధాన్ని నిజమనుకొని పోస్టుమార్టం వద్దన్నారు. అయితే, మృతుడి వయసు, చనిపోయిన తీరుపై అనుమానపడ్డ పోలీసులు శవపరీక్ష నిర్వహించాల్సిందేనని పట్టుబట్టగా, ఈ క్రమంలో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి.
ఢిల్లీ నగరానికి చెందిన కరణ్ అనే 36 ఏళ్ల వ్యక్తి మృతి కేసులో నిజాలు బయటపడ్డాయి. విద్యుత్ షాక్ వల్ల చనిపోయాడని తొలుత అందరూ భావించినా, భార్యకు ఉన్న శారీరక సంబంధం ఈ ఘోరానికి దారితీసినట్టు తేలింది. విద్యుత్ షాక్ కాదు, పక్కా హత్య అని పోలీసులు బయటపడ్డారు. కరణ్ దేవ్ భార్య సుష్మిత జులై 13న అప్పటికే చనిపోయిన తన భర్తను ‘మాతా రూపరాణి మాగ్గో’ అనే హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారని చెప్పింది. అయితే, కరణ్ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. కరెంట్ షాక్ నిజమేమోనని భావించిన కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం కూడా అవసరం లేదని చెప్పారు.
Read Also- Azharuddin: అజారుద్దీన్ ఇంట్లో దొంగలుపడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే?
సమాచారం అందుకున్న పోలీసులు, మృతుడి వయస్సు, అనుమానాస్పద ఆనవాళ్లు కనిపిస్తుండడంతో పోస్ట్‌మార్టం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. మృతుడి భార్య సుష్మిత, మరిది రాహుల్ పోస్ట్‌మార్టం వద్దంటూ పదేపదే కోరారు. అయినప్పటికీ పోలీసులు వినలేదు. నగరంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు శవాన్ని తరలించి శవపరీక్ష చేయించారు. దీంతో, కరణ్ మరణించిన మూడవ రోజున అతడి తమ్ముడు కునాల్ మరణంపై అనుమానం వ్యక్తం చేశాడు. తన అన్నయ్యను అతడి భార్య, బంధువు రాహుల్ ఇద్దరూ కలిసి హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుష్మిత, రాహుల్ మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లను కూడా ఆధారంగా చూపించాడు.
దీంతో, నిందితులు ఇద్దర్ని పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరూ ముందే ప్లాన్ వేసుకొని కరణ్‌ను హత్య చేసినట్టుగా బయటపడింది. కరణ్ తినే భోజనంలో ఏకంగా 15 నిద్ర మాత్రలు కలిపారు. అతడు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత, ఏవిధంగా హత్య చేయాలనే దానిపై గూగుల్‌లో సెర్చ్ చేశారు. అన్ని నిద్ర మాత్రలు ఇచ్చినా ఇంకా ఊపి ఆడుతుండడంతో ‘నాకు నిద్ర వస్తోంది’ అంటూ ప్రియుడితో మెసేజ్ చేసింది. చివరకు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురై చనిపోయినట్టు చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాలను నిందితురాలు సుష్మిత ఒప్పుకుంది. అరెస్ట్ చేసి ప్రశ్నించగా ఈ విషయాలను వెల్లడించింది. మరిది రాహుల్‌తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేశానని పేర్కొంది. ‘కర్వా చౌత్’ పండుగకు ముందురోజు కరణ్ తనను తిట్టి, కొట్టాడని, ఎప్పుడుచూసినా డబ్బు అడిగేవాడని, దాంతో తాను మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డానని ఆమె కారణంగా తెలిపింది.
Read Also- Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటనపై ప్రాథమిక సమాచారం ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారకా) అంకిత్ సింగ్ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేశామని, పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతుందని వివరించారు.