Uttar Pradesh Crime: మనుషుల మధ్య బంధాలు నానాటికి బలహీన పడిపోతున్నాయి. సొంత బంధువులపైనే కొందరు ఉన్మాదంగా దాడులు చేస్తున్నారు. తీవ్రంగా గాయపరుస్తూ.. మానవ జాతికి కళంకం తెస్తున్నారు. తాజాగా యూపీలో ఈ తరహా ఘటనే జరిగింది. తండ్రి తర్వాత తండ్రిగా భావించే మామయ్యపై ఓ కోడలు దారుణంగా దాడి చేసింది. మంచంపై పడేసి చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు విషయంలో వివాదం
ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటావా ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన తండ్రితో కలిసి తన మామను మంచం మీద పడేసి పలుమార్లు అతడి చెంపపై కొట్టింది. అతడి కాలర్ పట్టుకొని బలంగా లాగుతూ తీవ్రంగా దూషించింది. మంచంపైకి బలంగా తోసేసి పదే పదే దాడి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానిక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. అయితే డబ్బు విషయంలో మామ కోడలి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటావాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన తండ్రితో కలిసి తన మామను మంచం మీద పడేసి, పలుమార్లు అతడి చెంపపై కొట్టింది. ఆ మహిళకు ఏడాది క్రితమే వివాహమైందని, డబ్బు విషయంలో ఆమెకు, తన మామకు మధ్య వివాదమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. నిందితులైన తండ్రీకూతుళ్లపై పోలీసులు కేసు… pic.twitter.com/xj0RYjbyJH
— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2025
Also Read: Cancer Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. నిర్లక్ష్యం చేయోద్దు.. క్యాన్సర్ కావొచ్చు!
నెటిజన్లు ఫైర్
మామపై మహిళ దాడి చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ఆ విధంగా దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి.. ఆమె తండ్రి కూడా దాడిని ప్రోత్సహించడాన్ని తప్పుబడుతున్నారు. ఏమైనా విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సలహా ఇస్తున్నారు. వయసులో పెద్దవాడైన బాధితుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో పోలీసుల వరకూ వెళ్లేలా షేర్ చేయాలని కోరుతున్నారు.