Errabelli Gudem Farmers (IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Errabelli Gudem Farmers: ఎర్రబెల్లి గూడెం గ్రామానికి ఎస్సారెస్పీ కాలువ వచ్చేనా?

Errabelli Gudem Farmers: గ్రామానికి ఎస్సారెస్పీ కాలువ నీటి జలాలు లేక విలవిల లాడుతున్న ఎర్రబెల్లి గూడెం గ్రామస్తులు, రైతులు. వర్షాలపై ఆధారపడి తమ జీవనాన్ని, కుటుంబ పోషణను సాగిస్తున్న 500 ఎకరాల కర్షకులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కాలం నుండి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామస్తులు వర్షానికి ఆధారపడి వరి సాగు చేస్తున్నారు. అదే క్రమంలో 2018 సంవత్సరం స్థానిక సంస్థ శాసనసభ, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (Banoth Shankar Nayak) గ్రామానికి ఎస్సారెస్పీ కాలువ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించి నిర్మాణ పనులు చేస్తానని హామీ ఇచ్చారు.

 Also Read:Warangal Crime: రాష్ట్రంలో ఘోరం.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన భార్య.. ఎలాగంటే? 

ఏళ్లు దాటిన 10 ఏండ్ల కాలంలో ఇలాంటి పనులు జరగక గ్రామంలోని ప్రజలు ప్రభుత్వంపై నిరాశ చెందారు. అదే తీరుగా 2024 స్థానిక శాసనసభ ఎన్నికలలో నేటి మహబూబాబాద్ (Mahbubabad) ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్‌ను  (MLA Bhukya Murali Naik)  గ్రామస్తులు ఎస్సారెస్పీ కాల్వను గ్రామానికి తేవాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా లేవనెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)  ఏర్పడి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కృషి చేసినట్లయితే గ్రామానికి కాలువ తెచ్చే బాధ్యత తమదని గ్రామంలోని ప్రజలకు ప్రస్తుత ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ హామీ ఇచ్చారు. నేటికీ ఇలాంటి పనులు జరగకపోవడంతో గ్రామములోని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మా గోడు పట్టించుకునే నాధుడే లేడా?

వర్షాకాలం ప్రారంభమై నెల 15 రోజులు గడుస్తున్న వర్షాలు పడకపోవడంతో చెరువు నీటిపై ఆధారపడుతున్న కర్షకులు ఏండ్లు గడుస్తున్న మా గోడును పట్టించుకునే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరని తమ గోడును ఎవరితో చెప్పుకోవాలని కుమిలిపోతున్న నేపథ్యం గ్రామంలో నెలకొంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామస్థాయి సర్పంచ్ ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యాన్ని చూస్తూనే ఉన్నాం. స్థానిక ఎన్నికల ముందే గ్రామానికి ఎస్సారెస్పీ కాలువ నిర్మాణ పనులు చేపడితేనే స్థానిక గ్రామస్థాయి ఎన్నికలను గ్రామంలో నిర్మిస్తాం అంతవరకు ఎలాంటి ఎన్నికలు జరిపేదే లేదని గ్రామస్తులు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తాం
యూత్ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పనికెర ఉపేందర్ యాదవ్
గత పది ఏళ్ల కాలంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించలేదు ఇటీవలే ఇందిరమ్మ ఇండ్ల పథకాలతో లబ్ధిదారులు ఆనంద పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామానికి ఎస్సారెస్పీ కాల్వ పనులు ఎమ్మెల్యే మురళి నాయక్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తాం.
 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

Just In

01

Crime News: పనిచేస్తున్న సంస్థకే టోకరా.. కోటిన్నర విలువ చేసే నగలతో పరార్.. ఎక్కడంటే..?

SIM Box Scam: సిమ్​ బాక్స్ వ్యవస్థతో నయా మోసం.. ఎలా చేశారో తెలిస్తే షాక్ కావాల్సిదే..?

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రికి కొత్త బాస్‌ నియామకం.. ఎవరంటే..?

Teja Sajja: ‘మిరాయ్‌’లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. చూసే వారికి గూస్‌బంప్స్ పక్కా!

Chiranjeevi: ఈ కట్టె కాలేంత వరకూ మీ అభిమానినే.. ఈ మాట అంది ఎవరో తెలుసా?