UP Case
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: గూగుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..లివ్-ఇన్ పార్టనర్‌పై..

Viral News: ఈ మధ్యకాలంలో నేరాలకు పాల్పడేవారు కూడా టెక్నాలజీ సాయం (Viral News) తీసుకుంటున్నారు. ఇంటర్నెట్‌ లేదా ఇతర సెర్చింజన్‌లలో వెతికిమరీ దొంగదారులు వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే పంథా ఎంచుకున్నాడు. తన లివ్-ఇన్ పార్టనర్‌ను హత్య చేయడానికి ముందు గూగుల్‌లో ఎలా చంపాలో సెర్చ్ చేశాడు. యూట్యూబ్‌లో కూడా కొన్ని వీడియోలు చూశాడు. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడు. మహిళ చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని తీసుకెళ్లి ఓ నదిలో విసిరేశాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌‌పూర్‌లో వెలుగుచూసింది.

మృతురాలి పేరు రాణి, హత్యకు పాల్పడిన వ్యక్తి పేరు జగదీష్ రాయిక్వార్ అని పోలీసులు గుర్తించారు. తనకు వేరే యువతితో వివాహం నిశ్చయమైనప్పటికీ, లివ్-ఇన్ పార్ట్‌నర్‌గా ఉండాలంటూ బలవంతం చేయగా రాణి ఒప్పుకోలేదు, దీంతో ఆమెను నిందితుడు ఈ విధంగా హతమార్చాడు. హత్య తర్వాత పారిపోయే ప్రయత్నంలో ఉన్న నిందితుడు జగదీష్‌ను పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తులో నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడాడని తెలిపారు. ‘‘ఆమెకి చావాలనిపించింది. అందుకే నేను చంపేశాను’’ అంటూ నిర్లక్ష్యపూరిత సమాధానం ఇచ్చాడని పోలీసులు వివరించారు.

Read Also- ULI: సిబిల్ స్కోర్‌కు చెల్లుచీటీ.. కొత్త విధానం వచ్చేస్తోంది!

బాధితురాలు రాణి ఇదివరకే నరేంద్ర అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, అతడిని వదిలేసి లలిత్‌పూర్‌‌లో ఒక అద్దె ఇంట్లో జగదీష్‌తో సహజీవనం చేసిందని వివరించారు. అయితే, జగదీష్‌కి మరో పెళ్లి నిశ్చయమైందని, త్వర‌లో రానున్న భార్యతో పాటు రాణి కూడా తనతోనే ఉండాలంటూ జగదీష్ పట్టుబట్టాడు. ఈ డిమాండ్‌ను రాణి తిరస్కరించింది. అతడి వద్ద నుంచి వెళ్లిపోయి మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో మరొక వ్యక్తితో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, జగదీష్‌ ఇందుకు ఆగ్రహంతో రగలిపోయాడు. దీంతో, రాణిని హత్య చేసేందుకు గూగుల్, యూట్యూబ్‌లో హత్య చేయడం ఎలా అని సెర్చ్ చేసి, ఒక ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాడు.

Read Also- US Visa: యూఎస్ వీసా వచ్చేదెట్టా?.. ఆందోళనలో భారతీయ విద్యార్థులు

ఆ తర్వాత, కలవాలంటూ రాణిని పిలిచి, ఆమెకు విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె గొంతునులిమి కొన ఊపిరిని కూడా తీసేశాడు. ఆ తర్వాత, ఒక నీలం రంగు సంచిని కొనుగోలు చేసి, డెడ్‌బాడీని అందులో పెట్టి, సమీపంలో ఉన్న షహజాద్ అనే నదిలో పడేశాడు. గత బుధవారం స్థానిక మత్స్యకారులు నదిలో తేలియాడుతున్న నీలం గోనె సంచిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పూర్తిగా డీకంపోజ్ కావడంతో గుర్తించడం మారిందని, అయితే, ఆమె చేతిపై ఉన్న టాటూ (ఆర్-జగదీష్) ఆధారంగా గుర్తించినట్టు పోలీసులు మీడియాకు వివరించారు. జగదీష్ తన ఊరికి వెళ్లిపోయి అనుమానం రాకుండా కొన్నాళ్లు ఉండాలనుకున్నాడని, ఈలోగానే సాక్ష్యాలను సేకరించి అతడ్ని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. విషం, గోనె సంచిని ముందే సిద్ధం చేసుకొని, బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి నదిలో పడేసినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్