Jurala project: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు వరదతో పాటు భీమా నది నుండి వస్తున్న వరదతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాలకు నీటి ప్రవాహం తగ్గడంతో అయిదు రోజుల క్రితం గేట్లు మూసివేయగా రాత్రి నుంచి జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఉదయం జూరాల అధికారులు 12 గేట్లు తెరిచారు. మద్యాహ్నం నుంచి వరద ప్రవాహం పెరగడంతో మరో 6 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read: Seed Cotton Companies: సీడ్ కంపెనీల కుట్రలను చిత్తు చేసిన రైతులు
నీటిమట్టం 318.51 మీటర్లు
అదే విధంగా కర్ణాటక జలాశయాలు ఇప్పటికే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోగ ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 1,15,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.670 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్టంగా 9.65 టీఎంసీలకు గాను 7.971 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అదేవిధంగా 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 30,498 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 1,06,213 క్యూసెక్కుల ఔట్ ఫ్లో గా నమోదైంది.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..