Bandi Sanjay on KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి జల్సాలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ (BJP) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బీఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకే తానులోని ముక్కలే అని బండి అన్నారు. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ (Congress) ఏడాదిన్నర పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంటో చూపాలని బండి సవాల్ విసిరారు.
Also Read: Bandi Sanjay: టీటీడీ ఏమైనా సత్రమా.. అన్యమతస్తులను తొలగించరా.. ఏపీ సర్కార్‌పై బండి ఫైర్!
ఎందుకు అరెస్ట్ చేయడంలేదు
అభివృద్ధిపై చర్చించడానికి తాను ఏ గ్రామానికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని బండి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను పరిష్కరించడం కేంద్రం బాధ్యత అని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను కేంద్రం పరిష్కరించాలని చూస్తుంటే కేంద్రాన్నే తప్పుపడుతున్నారని ఆరోపించారు. రెండు రాష్రాల ప్రయోజనాలను కాపాడడం కేంద్రం బాధ్యత అన్నారు. తెలంగాణ పేరుతో బీఆర్ ఎస్ మళ్లీ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని బండి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ వారిని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఎందుకు అరెస్ట్ చేయడంలేదని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బండి విమర్శించారు. బీసీలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలే ఉన్నారని బండి అన్నారు. దామాషా ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని బండి డిమాండ్ చేశారు.
Also Read: Seed Cotton Companies: సీడ్ కంపెనీల కుట్రలను చిత్తు చేసిన రైతులు