Hair Tips: వర్షంలో తడవడాన్ని కొందరు అమితంగా ఇష్టపడుతారు. వాననీటిలో తడిసిపోయి ఆనందపడుతుంటారు. అయితే, వర్షపు నీటిలో తడవడం జుట్టు ఆరోగ్యానికి ఏమాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు. వాననీటిలో జుట్టు తడిస్తే గట్టిదనాన్ని కోల్పోయి బలహీనంగా, నిస్తేజంకు తయారవుతుంది. అంతే కాదు, వర్షాకాలంలో అధిక తేమ, తక్కువ సూర్యకాంతి వంటి వాతావరణ అంశాలు కూడా జుట్టుకు హానికలిగిస్తాయి. అందుకే, వర్షాకాలం సీజన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే కురులను సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డా.అపర్ణా సంతోషం అనే డెర్మటాలజిస్ట్, హోలిస్టిక్ వెల్‌నెస్ కోచ్ వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు 5 ముఖ్యమైన సూచనలు చేశారు.
1. వర్షపు నీరు జుట్టుకు మంచిది కాదు
వర్షపు నీరు జుట్టుకి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛంగా ఉండవు. వర్షం పడే సమయంలో నీరు కిందకు వచ్చే క్రమంలో వాయు మలినాలు, దుమ్ము, ఆమ్లకణాలను శోషించుకుంటుంది. తద్వారా వర్షపు నీటిలో ఉండే సహజ పీహెచ్ (pH) స్థాయి జుట్టుని నాశనం చేస్తాయి. జుట్టు వెలసి, బలహీనంగా తయారవుతుంది. చుండ్రు (డాండ్రఫ్), తల దురద వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి, వర్షంలో తడవడం కాసేపు సరదాగా అనిపించినా.. జుట్టుకు రసాయనాలను పట్టించినట్టే అవుతుంది.
2. మంచినీళ్లతో తలస్నానం
సరదాగా వర్షంలో తడిశాక.. మొదటి జాగ్రత్త వర్షపు నీటిని తలకే ఎండిపోకుండా చూసుకోవాలి. వెంటనే ఇంట్లో నీళ్లతో తలస్నానం చేయాలి. దుమ్ము, మలినాలు, సల్ఫేట్ పూర్తిగా పోగొట్టేందుకు షాంపూ వాడితే బాగుంటుంది. జుట్టుని సున్నితంగా మలినాలు పోయేట్టుగా చేయాలి.
Read Also- Viral Video: ఏఐ మ్యాజిక్.. ఈ వీడియో నిజం కాదంటే నమ్మలేరు!
3. పొడిబార్చుకోవాలి
తలస్నానం చేసిన తర్వాత హైడ్రేటింగ్ కండిషనర్ వాడాలి. అప్పుడు బరువెక్కిన జుట్టు సాధారణ స్థితికి వస్తుంది. తేమ కూడా పోతుంది. తద్వారా జుట్టు మెత్తగా, మృదువుగా మారుతుంది. తుడిచేటప్పుడు టవల్‌తో మృదువుగా తుడుచుకోవాలి. బలంగా రుద్దితే తడి జుట్టుకు హానికరం. కాబట్టి, వీలైతే హేయిర్ డ్రయర్ వాడాలి. ఒకవేళ డ్రయర్‌ను వాడితే కూల్ మోడ్‌లో మాత్రమే ఉపయోగించాలి.
4. ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి
వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జుట్టును మూడు లేదా అంతకంటే ఎక్కువ పాయలు చేసి జడలు వేసుకోవాలి. తద్వారా చక్కగా గాలి ఆడుతుంది. కొప్పు వేసుకోవడం ద్వారా తేమ ప్రభావం నుంచి రక్షణనిస్తాయి. యాంటీ-ఫ్రిజ్ సీరమ్‌లు లేదా లీవ్-ఇన్ కండిషనర్లు వాడితే తడి వాతావరణంలో కూడా జుట్టు సజావుగా ఉంటుంది. వారానికి ఒకసారి క్లారిఫైయింగ్ షాంపూ వాడితే, పొగ, చెమట, జెల్‌ల నుంచి జుట్టుని శుభ్రంగా ఉంచుతాయి.
Read Also- Gold Rates Down: ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. త్వరలో రూ.30,000 వేల వరకు తగ్గనున్న గోల్డ్ రేట్స్..?
5. సీజన్‌కు తగ్గట్టు షాంపూలు
చాలా ఎక్కువసార్లు తలస్నానం చేయడం కూడా ఏమంత మంచిది కాదు. వారానికి 2-3సార్లు మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే చాలు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వర్షాకాలంలో బయట తేమ ఉన్నా జుట్టు పొడిగా మారుతుంది. వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ మాస్క్ వాడితే జట్టు మెరుగుపడడమే కాకుండా ధృడంగా మారుతుంది. మొత్తంగా చెప్పాలంటే, వర్షంలో తడవడం కాసేపు ఆనందంగా అనిపించవచ్చు. కానీ, హానికరమని స్పష్టమవుతోంది. ఒకవేళ తడిసినా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు.
గమనిక: సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.