Genelia (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Genelia: వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. జెనీలియా రీ ఎంట్రీ అదుర్స్..

Genelia: “అంతేనా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే ఓ కప్పు కాఫీ” అంటూ తన ఐకానిక్ డైలాగ్‌తో జెనీలియా డిసౌజా మరోసారి అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ డైలాగ్‌ను జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె గుర్తు చేస్తూ, తన సహజమైన చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన జెనీలియా, దాదాపు ఒక దశాబ్దం తర్వాత తెలుగు సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఆమె తాజా ప్రాజెక్ట్, కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రంతో తిరిగి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.

Also Read: Immunity Boosting Tips: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే 7 చిట్కాలు.. ఇవి పాటిస్తే డాక్టర్‌తో పని లేనట్లే!

టాలీవుడ్‌లోకి జెనీలియా రీ ఎంట్రీ

జెనీలియా ఇప్పుడు కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రంతో టాలీవుడ్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఆమె సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓగా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో కిరీటి, మాజీ కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు, హీరోగా పరిచయమవుతున్నాడు. స్టార్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ చిత్రంలో రొమాంటిక్ లీడ్‌గా నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో, సాయి కొర్రపాటి నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్-రొమాంటిక్ డ్రామా అనేక వినోదాత్మక అంశాలతో రూపొందుతోందని టాక్.

Also Read: Telangana: ప్రైవేటుతో ఎలక్ట్రిక్ బస్సుల ఒప్పందం రద్దు చేసుకోవాలి.. సీఎంకు ఆర్టీసీ ఎంప్లాయిస్ లేఖ

 భర్త, పిల్లలతో  జెనీలియా..

2012లో నా ఇష్టం తర్వాత తెలుగు సినిమాలకు దూరమైన జెనీలియా, తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి కుటుంబం పై దృష్టి పెట్టింది. వీరికి ఇద్దరు కుమారులు. రియాన్, రాహిల్ తో ఆమె సమయాన్ని గడిపింది. అయితే, 2022లో మరాఠీ చిత్రంతో ఆమె తిరిగి నటనలోకి అడుగుపెట్టింది, ఇది మరాఠీ బాక్సాఫీస్‌లో భారీ విజయం సాధించింది.

Also Read: Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?

హాసిని పాత్రను తెలుగు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు..

బొమ్మరిల్లు సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే.. దానికి ఒక కారణం  హాసిని పాత్ర కూడా. అందులో జెనీలియా చేసిన పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగులు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే. ముఖ్యంగా, జెనీలియా చెప్పే వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగ్ తెలుగు ఆడియెన్స్ ఇప్పటికీ కూడా ఎంతోమంది ఇష్టపడతారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ